10 Digit phone Number : మనం వాడే ఫోన్ నెంబర్ లో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?  

మనం సాధారణంగా ఒక సింగల్ డిజిట్ నెంబర్ జీరో నుండి తొమ్మిది వరకు ఉపయోగిస్తే తొమ్మిది నంబర్లను మాత్రమే జనరేట్ చేయవచ్చు. 

10 Digit phone Number : ఈరోజుల్లో వివిధ రకాల కొత్త మోడల్ ఫోన్ లను వినియోగిస్తూ ఉన్నారు. కొన్ని వేలు పెట్టి కాస్ట్లీ ఫోన్ లు కొంటూ ఉంటారు. ఎంత ఖరీదయిన ఫోన్ కొన్న కూడా ఖచ్చితంగా అందులో సిమ్ వేసే ఉపయోగించాలి. ఒక నెంబర్ తీసుకుంటాం. ఏ నెంబర్ తీసుకున్నా కూడా అందులో10 అంకెలు మాత్రమే ఉంటాయి.

మరి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫోన్ నెంబర్ కి 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయి. అటు ఇటు గా ఎందుకు ఉండవు? ఏ ప్రశ్నకి ఐన సమాధానం ఉంటుంది. అలాగే, ఫోన్ నెంబర్ కి 10 అంకెలే ఎందుకు ఉండాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

10 Digit phone Number

 

మనం సాధారణంగా ఒక సింగల్ డిజిట్ నెంబర్ జీరో నుండి తొమ్మిది వరకు ఉపయోగిస్తే తొమ్మిది నంబర్లను మాత్రమే జనరేట్ చేయవచ్చు. అయితే, ఇప్పుడు ఒకసారి మనం చిన్నప్పుడు చదువుకున్నపర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే కాన్సెప్ట్ ని ఒకసారి గుర్తు చేసుకుందాం. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే పాఠం ప్రకారం,  మనం ఒక డిజిట్ ని ఉపయోగించి 10 నెంబర్ లు, రెండు డిజిట్స్ ని ఉపయోగించి 100 నెంబర్ లను జనరేట్ చేయవచ్చు.

అలా 10 డిజిట్ లను ఉపయోగిస్తే 1000 కోట్లు ఫోన్ నెంబర్ లను జనరేట్ చేయవచ్చు. ఏ దేశంలో అయిన ఆ దేశ జనాభాను బట్టి మరియు వారు ఉపయోగిస్తున్న డివైజెస్ ని బట్టి ఫోన్ నెంబర్ లలో ఎన్ని డిజిట్స్ ఉండాలి అనేది ఆధారపడి ఉంటుంది.

2003 లో 10 అంకెల ఫోన్ నెంబర్ డిజిట్స్ ని కనిపెట్టినప్పుడు మన దేశ జనాభా 111 కోట్లు ఉంది. దాంతో, నేషనల్ నంబరింగ్ ప్లాన్ (NNP) 2003లో దీని పరిచయం చేసింది. అంటే, 10 డిజిట్స్ నంబర్స్ ఉపయోగించడం వల్ల 1000 కోట్ల యూనిక్ నెంబర్ లను ఉపయోగించవచ్చు.  2023 ఆగష్టులో ట్రాయ్ ఇచ్చిన ఇంఫార్మేషన్ ప్రకారం, భారతదేశంలో 114 కోట్ల నెంబర్లను ఉపయోగించారు.

10 Digit phone Number

Comments are closed.