10th Class Results 2024: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు పూర్తయింది. ఏప్రిల్ 3 నుంచి స్పాట్ ప్రక్రియ పూర్తి కాగా, ఏప్రిల్ 11 నాటికి పూర్తి చేయాలని అధికారులు భావించారు. మధ్యలో ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో కొంచెం ఆలస్యమైంది. అయితే నిన్నటితో 10th స్పాట్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. స్పాట్ వాల్యుయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 స్థానాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
టెన్త్ స్పాట్ (SSC స్పాట్ వాల్యుయేషన్ 2024) ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావడంతో సాంకేతిక అంశాలను పరిశీలించడంతో పాటు మార్కులను నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పరీక్ష ఫలితాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఫలితాలు ఎప్పుడు వస్తాయి?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల పనుల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. దీంతో వీలైనంత త్వరగా ఫలితాలను అందించాలని తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు భావిస్తోంది.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2023వ సంవత్సరంలో అయితే, మే 10న వెల్లడైంది. ఏప్రిల్ 13న పరీక్షలు ముగిశాయి. అయితే, ఈ విద్యా సంవత్సరం పరీక్షలు ముందుగానే ప్రారంభమయ్యాయి. మార్చి 18న మొదలై… ఏప్రిల్ 2 నాటికి అన్నీ పూర్తి అయ్యాయి. స్పాట్ వాల్యుయేషన్ వెంటనే ప్రారంభమైంది. గతంలో లాగా మే రెండో వారంలో కాకుండా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. లేదంటే, మే మొదటి వారంలో ఏ రోజునైనా ఖరారు చేయవచ్చు. ఫలితాలు వెలువడినప్పుడు ఎన్నికల సంఘానికి కూడా తెలియజేయాలి. ఫలితాలు EC ఆమోదంతో ప్రకటిస్తారు.
ఈ ఏడాది తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షలు మొత్తం 2,676 కేంద్రాల్లో జరుగుతాయి.
పదో తరగతి ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
- తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://telangana-board-resultsని సందర్శించవచ్చు.
- హోమ్ పేజీలో https://telangana-board-10th-result-2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ మార్కులను చూడడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్‌ను నమోదు చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
- మీ మార్క్ వివరాల కాపీని పొందడానికి, ప్రింట్ ఆప్షన్ ను ఉపయోగించండి.
- మరోవైపు, మీరు తెలంగాణ పదవ తరగతి పరీక్షా బోర్డు అధికారిక వెబ్‌సైట్https://bse.telangana.gov.in/ని సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
- హోమ్ పేజీలో కనిపించే TS SSC ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేసి, ఆపై సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ ఫలితాలు కనిపిస్తాయి. మార్కుల మెమోను పొందడానికి, ప్రింట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
10th Class Results 2024