10th Supplementary Exams: ఈరోజే తెలంగాణ సప్లమెంటరీ పరీక్షలు, 170 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు
10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు రేపు సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13 వరకు నడుస్తాయి.
10th Supplementary Exams: 10వ తరగతి పాస్ అయినా విద్యార్థులు తర్వాత విద్యను అభ్యసించడానికి ఎక్కడ చదవాలి? ఏం కోర్స్ తీసుకోవాలి? ఏ కాలేజ్ లో జాయిన్ అయితే బాగుంటుంది అని ఎన్నో ప్లాన్ లు వేసుకుంటుంటూనే ఉన్నారు. చాలా మంది విద్యార్థులు (Students) తాము చదవాలనుకున్నా కోర్స్ ని ఎంచుకొని ఇప్పటికే కొన్ని కాలేజీల్లో జాయిన్ కూడా అయ్యారు.
సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ వంటి గురుకులాల్లోనూ చాలా మంది తెలంగాణ పిల్లలు ఇప్పటికే చేరినట్లు సమాచారం. ఇక, 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు (Supplementary Exams) రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈరోజు సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుండి జూన్ 13 వరకు ఈ పరీక్షలు నడుస్తాయి. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే మూడు గంటలపాటు ఆ తేదీలలో ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 51,237 మంది విద్యార్థులు 10వ సప్లిమెంటల్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇందులో 31,625 మంది బాలురు మరియు 19,612 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 170 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 1300 మంది ఇన్విజిలేటర్లు (invigilators) విధుల్లో ఉంటారు. సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకొని రాకూడదు. విద్యార్థులు టైం కి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
10వ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 11వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో డాక్టర్ కె.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1070 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ (Flying Squad) , సిట్టింగ్ స్క్వాడ్ (Sitting Squad) , డీవో, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్ల నియామకాలు చేపట్టామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
Also Read:TSPSC Hall Tickets : టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..!
విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా, బస్సులు నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు లేఖలు పంపినట్లు తెలిపారు. పోచంపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్ (Gowtham Model School) లో వేసవి పాఠాలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసులు వచ్చాయని తెలిపారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన యజమానులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుంది?
జూన్ 3న తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ లో కాంపోజిట్ కోర్సు-1 మరియు కాంపోజిట్ కోర్సు-2 పరీక్షలు.
జూన్ 5న సెకండ్ లాంగ్వేజ్
జూన్ 6న ఇంగ్లీష్.
జూన్ 7న గణితం
జూన్ 8న ఫిజిక్స్
జూన్ 10 న జీవశాస్త్రం.
జూన్ 11న సోషల్ సైన్స్
జూన్ 12న OSSC మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం మరియు అరబిక్) పేపర్-1
జూన్ 13న OSSC మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం మరియు అరబిక్) పేపర్ II పరీక్షలు
Comments are closed.