1Lakh For Womens: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని మన అందరికీ తెలుసు. మరి కొన్ని రోజులో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అధికారంలోకి రావడం కోసం తమ తమ హామీలను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఎన్నికల వరాలను కురిపిస్తుంది. మేనిఫోస్ట్లో భాగంగా కాంగ్రెస్ “నారీ న్యాయ్ గ్యారెంటీ”ని ప్రకటించారు.
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏమి ఏమి హామీలు ఇచ్చింది? మహిళలకు అవి ఎలా ఉపయోగపడతాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పర్యటన..
కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశ్యంతో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర పర్యటన చేశారు. బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎన్నికల హామీలు ఇస్తామని చెప్పుకొచ్చారు. మహాలక్ష్మి, జనాభాలో సగం పూర్తి హక్కులు, అధికార మైత్రి, శక్తి సమ్మాన్, సావిత్రి భాయ్ పూలె హాస్టల్స్ వంటి మొత్తం 5 హామీలు ఇచ్చారు. ఆ 5 హామీల గురించి పూర్తి వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 హామీలు ఇవే!
మహాలక్ష్మి పథకం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకి ఏడాదికి అక్షరాల లక్ష రూపాయలు అందజేస్తామని వెల్లడించారు. మొత్తం 5 సంవత్సరాల్లో రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపిన రాహుల్ గాంధీ. మహిళలకు ఆర్థిక సాయం అందించి నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు.
సగం జనాభా – సంపూర్ణ హక్కులు
సగం జనాభా – సంపూర్ణ హక్కులు కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే అన్ని కార్యాలయాలకు ఇది వర్తిస్తుంది.
అధికార మైత్రి
అధికార మైత్రి కింద మహిళలకు న్యాయపరంగా సహాయం అందించడం. గ్రామ స్థాయిల్లో వారికి దక్కాల్సిన హక్కుల గురించి తెలియజేసి వాటిని కాపాడేందుకు అధికార మైత్రి నియమిస్తారు.
శక్తి సమ్మాన్
కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి సమ్మాన్ కింద ఆశా, అంగనవాడి మరియు మధ్యాహ్న భోజనం వండే వారికి వారి జీతాలు రెట్టింపు చేస్తామని ప్రకటించారు.
సావిత్రి భాయ్ పూలె హాస్టళ్లు
సావిత్రి భాయ్ పూలె హాస్టళ్ల కింద ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వారికి ఇబ్బంది లేకుండా హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. ప్రతి జిల్లాకు కనీసం ఒక్క హాస్టల్ అయిన అంబాటులో ఉండేలా చేయడం.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…