2024 Best Ford Endeavour launching in India : ఎండీవర్ తో భారత్ లోకి ఫోర్డ్ ఎంట్రీ, మరి ఫీచర్స్, పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలుసా?

2024 Best Ford Endeavour launching in India
image credit : MotorsBrand

2024 Best Ford Endeavour launching in India : ఫోర్డ్ యొక్క ఫేమస్ అండ్ పవర్ ఫుల్ మోడల్ అయిన “ఎండీవర్” తో ఫోర్డ్ తిరిగి ఇండియన్ మార్కెట్ లోకి రాబోతుంది, న్యూ ఫోర్డ్ “ఎండీవర్” యొక్క ఫీచర్స్, పెర్ఫార్మన్స్, ఇంటీరియర్ ఇంకా ఎన్నో మీ కోసం..

మోస్ట్ ఎవెయిటింగ్ ఫుల్ లోడెడ్ ప్రీమియం SUV తిరిగి వచ్చేసింది. 2024 సరికొత్త ఫోర్డ్ ఎండీవర్‌ ఈ సంవత్సరం భారతదేశానికి వస్తోంది. ఇది టయోటా ఫార్చ్యూనర్ కి ఒకప్పుడు గట్టి ప్రత్యర్థి చాల కలం తరువాత ఇప్పుడు మల్లి ఇండియన్ మార్కెట్ లోకి తిరిగి రాబోతుంది.

ఫోర్డ్ “ఎండీవర్”(Endeavour ), కొన్ని దేశాలలో “ఎవరెస్ట్”(Everest ) అని కూడా పిలుస్తారు, అయితె ఇండియన్ మార్కెట్ లో ఎండీవర్ అనే పేరుతొ రిలీజ్ అయింది, ఇది శక్తివంతం అయిన మరియు మంచి సామర్థ్యం గల SUV, ఇది మంచి ఆఫ్-రోడ్ ఎక్స్పీరియన్స్ మరియు విశాలమైన ఇంటీరియర్‌కు ఫేమస్. కొత్త ఎండీవర్ భారతదేశంలో 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్ లోకి వస్తుంది. అదే 2.0 డీజిల్ తో వస్తుంది, అయితే సింగిల్ టర్బో లేదా బై టర్బో న అని వేచి చూడాల్సిందే. భారతీయ మార్కెట్‌లో సరికొత్త మోడల్ త్వరలో విడుదల కానుండగా, ఆ మోడల్ కి సంబందించిన ఫీచర్స్ మరియు ఇంజిన్ పెర్ఫార్మన్స్ ఇంకా మరిన్ని విషయాలు ఎపుడు చూద్దాం.

 

2024 Best Ford Endeavour launching in India
image credit : automotorsindia

2024 Best Ford Endeavour launching in India

Exterior Design
కొత్త ఫోర్డ్ ఎండీవర్ ఒక బోల్డ్ మరియు అగ్రెసివ్ డిజైన్ తో వస్తుంది, ఆ డిజైన్ వల్ల ఇది మిగతా SUV ల కన్నా చాల పవర్ఫుల్ మరియు డిఫరెంట్ గ కనిపిస్తుంది. సొగసైన LED హెడ్‌లైట్లు మరియు డే టైం రన్నింగ్ లంప్స్(DRLS ) వస్తున్నాయి. కార్ ఎత్తు మరియు పెద్ద వీల్స్ వలన రోడ్ పై మంచి గ్రిప్ మరియు కమాండింగ్ ఫీల్ వస్తుంది. వాహనం వెనుక భాగంలో LED టెయిల్‌లైట్‌లు మరియు టెయిల్‌గేట్‌తో చక్కటి డిజైన్ తో వస్తుంది.

Interior
ఫోర్డ్ ఎండీవర్ మంచి విశాలమైన మరియు విలాసవంతమైన క్యాబిన్ తో అత్యంత సౌకర్యాన్ని మరియు లగ్జర్య్ ఫీల్ ని ఇస్తోంది. డ్యాష్‌బోర్డ్ హై క్వాలిటీ మెటీరియల్ తో డిజైన్ చేశారు మరియు మోడర్న్ లుక్ తో వస్తుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెంటర్ లో చాల ఆకర్షణగా ఉంది. సీట్లు సౌకర్యవంతంగా మరియు సపోర్టివ్‌గా ఉంటాయి, ప్రయాణికులందరికీ తగినంత లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ ఉన్నాయి. ఎండీవర్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక రకాల ఫీచర్లను కూడా అందిస్తుంది, ప్రతి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిర్ధారిస్తుంది.

 

2024 Best Ford Endeavour launching in India
image credit : automotorsindia

Performance
ఫోర్డ్ ఎండీవర్ 200 హార్స్‌పవర్‌లను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్‌తో సహా అనేక రకాల డీజిల్ ఇంజిన్‌ వేరియంట్స్ తో వస్తుంది అని భావిస్తున్నారు. ఈ ఇంజన్ 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది రహదారిపై మరియు ఆఫ్ రోడ్ లో స్మూత్ మరియు మంచి పవర్ ని అందిస్తుంది. ఎండీవర్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అనేక అధునాతన సాంకేతికతలు కూడా ఉన్నాయి, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు చక్కని కంట్రోల్ ని ఇస్తుంది.

Off-Road Capability
ఫోర్డ్ ఎండీవర్ యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి దాని ఆఫ్-రోడ్ సామర్ధ్యం. SUV ఫోర్-వీల్ డ్రైవ్, టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్ వంటి అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంది, ఇది చాలా కష్టం గ ఉన్న కొండల్ని కూడా సులభంగా ఎక్కడానికి వీలు కల్పిస్తుంది. మీరు రాలు ఉండే రోడ్ లో వెళ్లిన లేదా ఇసుక దిబ్బల మీదుగా ప్రయాణించినా, ఎవరెస్ట్ ఎలాంటి రోడ్ కండిషన్స్ అయిన సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తుంది.

మొత్తంమీద, ఫోర్డ్ ఎవరెస్ట్/ఎండీవర్ భారతీయ SUV మార్కెట్లో ఒక బలమైన పోటీ ఇస్తుంది. దాని బోల్డ్ డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్ మరియు ఆకట్టుకునే పనితీరుతో, ఇది దాని విభాగంలోని ఇతర SUVలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. మీరు కంఫర్ట్ లేదా స్టైల్‌లో కంప్రమైస్ అవకుండా మరియు సామర్థ్యం గల SUV కోసం మార్కెట్‌లో చుస్తు ఉన్నట్లయితే, ఫోర్డ్ ఎవరెస్ట్/ ఎండీవర్ మీకు సరైన ఎంపిక కావచ్చు.

Engine 3.0-liter turbocharged diesel engine
Power Output Over 200 horsepower
Transmission 10-speed automatic
Drive Type Four-wheel drive
Off-Road Features Terrain management system, electronic locking rear differential
Exterior Features Massive grille with chrome accents, sleek LED headlights and daytime running lights, raised ride height, prominent wheel arches, LED taillights, sculpted tailgate
Interior Features Spacious and luxurious cabin, high-quality materials, modern dashboard with large touchscreen, comfortable seats with ample legroom and headroom, climate control, premium audio system, panoramic sunroof
Safety Features Adaptive cruise control, lane-keeping assist, autonomous emergency braking
Dimensions
Colors Available GREY, BRONZE, BLUE, ORANGE, SILVER, WHITE

Also Read:New cars and bikes 2024 : ఈ సంవత్సరం విడుదల అయ్యే కార్స్ మరియు బైక్స్ వివరాలు మీ కోసం

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in