Telugu Mirror: కేవలం 90 సెకన్లు. ఒక మనిషి ప్రాణం పోవడానికి తీసుకున్న సమయం.. ఒక మనిషిని చంపడానికి పట్టిన సమయం.. బార్ లో జరిగిన చిన్న గొడవ, ఆపై కత్తిపోట్లు. ప్రాణం తీసిన ఈ సంఘటన జరగ డానికి పట్టిన సమయం కేవలం 90 సెకన్లు. ఆస్ట్రేలియాలో ఒక బార్ లో 90 సెకన్ల పాటు జరిగిన ఘర్షణ ఒక యువకుడి మరణానికి కారణం అయింది. ప్రపంచం మొత్తం లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి, అలాగే మనుషులలో తగ్గి పోతున్న ఓర్పు , క్షణం లోనే కోల్పోతున్న సహనం. మనిషి ప్రాణం పట్ల విలువ లేని తనంకి ఈ సంఘటన అద్దం పడుతుంది. జరిగిన సంఘటన పై సోషల్ మీడియాలో ఎమోషన్స్ పెల్లుబుకుతున్నాయి. స్నేహితుడి ఆకస్మిక మరణానికి కలత చెందిన మిత్రులు భావోద్వేగ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. జరిగిన హత్యా ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఆస్ట్రేలియా (Australia) లోని గోల్డ్ కోస్ట్ (GoldCoast) లోని ఒక బార్‌లో గత గురువారం రాత్రి 10:15 గంటలకు డైలాన్ మెక్ పెడెన్ అనే 26 సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడిపై కొంత మంది దాడి చేశారు. మెక్ పెడెన్ కి బార్ లోనే ఉన్న ఓ వ్యక్తితో వాగ్వాదం జరిగింది. గొడవ ప్రారంభమైన వెంటనే, నిందితులు డైలాన్ ఛాతీపై పదునైన కత్తితో గాయపరిచారు. అల్లకల్లోలంగా జరిగిన ఈ సంఘటన మొత్తం కేవలం 90 సెకన్లలోనే జరిగి పోయింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ. చికిత్స పొందుతూ కొన్ని గంటల తర్వాత మృతి చెందాడు.
హత్య విషయం వెలుగులోకి వచ్చిన తరువాత డిలాన్ స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ స్నేహితుడు ఈ లోకంలో లేడంటే నమ్మలేకపోతున్నారు. తమ స్నేహితుడితో ఉన్న సాన్నిహిత్యాన్ని,ప్రేమను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఒక యువకుడు సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు, “అతను ప్రత్యేకమైన వాడు, ఆసక్తిగా,కల్మషం లేకుండా మరియు స్నేహపూర్వకంగా ఉంటాడు. అతనితో ఎవరైనా ఇంత హింసాత్మకంగా ఎలా ప్రవర్తించారో నాకు అర్థం కావడం లేదు.” అని వ్రాశాడు. ఈ హత్యా ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బార్ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.