Telugu Mirror : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Infinix త్వరలోనే విడుదల చెయ్యబోతున్న Infinix GT 10 Pro మరియు Infinix GT 10 Pro+ కి సంబందించిన కొన్ని లీక్ లు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. Weibo user Perfect Arrangement Digital అనే చైనా వెబ్ సైట్ Infinix GT 10 Pro మరియు Infinix GT 10 Pro+ యొక్క ఫోటో లను లీక్ చేసింది. Infinix GT 10 Pro మరియు Pro+ ల యొక్క డిజైన్ మరియు కొన్ని స్పెసిఫికేషన్ లు తెలిసాయి.Infinix GT 10 Pro మరియు GT 10 Pro+ లలో ఎక్కువగా GT 10 Pro+ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.
INFINIX నుంచి మరో 5G స్మార్ట్ ఫోన్..HOT 30..ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ.
Infinix GT 10 Pro మరియు GT 10 Pro+ లను పోలిస్తే GT 10 Pro+ యొక్క డిజైన్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. Infinix GT 10 Pro+ యొక్క డిజైన్ ఈ జూలైలో విడుదల అయిన Nothing Phone (2) యొక్క డిజైన్ ఉన్నట్లుగా ఉంది. Infinix GT 10 Pro+ ట్రాన్స్ పరెంట్ రియర్ బ్యాక్ ను కలిగి ఉంది. అలానే Nothing Phone లలో ఉన్నట్లుగా LED స్ట్రిప్స్ లను Infinix లో కూడా చూడవచ్చు. ఈ LED స్ట్రిప్ లు గ్లాస్ ప్యానల్ లోపల ఉన్నాయి. ఈ ఫోటోను చూసిన Nothing కంపెనీ CEO మరియు సహ వ్యవస్థాపకుడు అయిన కార్ల్ పీ ట్విట్టర్ వేదికగా ” లాయర్ లను సిద్దం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ” అని పోస్ట్ చేసాడు.
Nothing Phone లో ఉన్న LED స్ట్రిప్ ల యొక్క ఫీచర్ లను Infinix కూడా GT 10 Pro+ వాడుతుందో లేదో చూడాలి. ఇదే కాకుండా Infinix GT 10 Pro మరియు GT 10 Pro+ la యొక్క స్పెసిఫికేషన్ లు కూడా లీక్ అయ్యాయి.Infinix GT 10 Pro MediaTek Dimensity 11300 SoC చిప్ సెట్ తో రాబోతున్నది. అలానే Infinix GT 10 Pro+ MediaTek Dimensity 8030 SoC చిప్ సెట్ తో అందుబాటులోకి రాబోతున్నది. Infinix GT 10 Pro మరియు 10 Pro+ గేమర్ లను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడిన హ్యాండ్ సెట్. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు ఆండ్రాయిడ్ 13 తో నడుస్తాయి. అలానే Full HD+ డిస్ ప్లే తో ఈ రెండు ఫోన్ లు రాబోతున్నాయి.
Mobile Sales : వాట్ ఎ టమోటా ఐడియా..
Infinix GT 10 Pro+ 108- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అలానే Infinix GT 10 Pro కూడా 108- మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది మరియు రెండు ఫోన్ లు కూడా 32- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. ఈ రెండు హ్యాండ్ సెట్ లు డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో వస్తున్నాయి. కేవలం GT10 Pro+ మాత్రమే LED స్ట్రిప్ లను కలిగి ఉంటుంది. రెండు ఫోన్ లు 5000mAh బ్యాటరీతో రాబోతున్నాయి. Infinix GT 10 Pro మరియు Infinix GT 10 Pro+ ముందుగా చైనాలో విడుదల కానున్నాయి.