Telugu Mirror : ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవుల ఉరుకుల పరుగుల జీవితాలలో క్షణం తీరిక లేని పని ఒత్తిడిలో శరీరం మరియు మెదడు తీవ్ర శ్రమకు లోనవుతున్నాయి. దీని ఫలితంగా మనుషులు శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. వాతావరణ కాలుష్యం మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పరిశోధనల ప్రకారం, ఇవన్నీ మానవ మెదడు మీద పెను ప్రభావాన్ని చూపుతాయి. అయితే మానవ మెదడు పై ప్రభావం చూపుతున్న కారణాలు ఇంకో 3 ఉన్నాయని,ఈ 3 కారణాలు మనం ప్రతిరోజు చేసే పనులేనని,అవి మెడడుపై గొప్ప ప్రభావాన్ని చూపెడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Post Office : జూలై 1 నుంచి వడ్డీ పెరిగిన పోస్ట్ ఆఫీస్ ఆర్డీ డిపాజిట్ పథకం..
మెదడు శక్తిని కోల్పోకుండా ఆయుర్వేద ఔషధాలతో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 6 ఆయుర్వేద నివారణలు సూచించారు.
పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ద్వారా ఈ మూడు విషయాలను గురించి వివరించారు. మారిన జీవన శైలిలో అనారోగ్యకరమైన ఆహారం,దానితో పాటు ఎక్కువ తీపి కలిగిన ఆహారాన్ని తినడం మరియు శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వలన శరీరం నాశనం అవడమే కాకుండా మెదడు మీద ప్రభావం చూపుతుంది. దీనిలో మొదటి లక్షణం ఙ్ఞాపకశక్తిని కోల్పోతారు.అయితే ఈ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు మెదడుకు ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని ఆయుర్వేద పదార్ధాలు ఉన్నాయని ఆమె తెలిపారు.
పసుపు
మెదడు 100శాతం వేగంతో ఆలోచించాలి అంటే పసుపుని ఆహారంలో తీసుకోండి.పసుపులో కర్కుమిన్ ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం మతిమరుపు వ్యాధిని నివారిస్తుంది.అలాగే ఙ్ఞాపకశక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది.పసుపును ఆహారం లో తీసుకోవచ్చు లేదా హెర్బల్ టీ తయారు చేసుకుని తాగవచ్చు.
బ్రాహ్మీ
బ్రాహ్మీ దీనిని మెదడుకు ఆరోగ్యాన్ని అందించే ఔషధం లోకి ఉపయోగించే ఆయుర్వేద మూలిక. దీనిని వాడడం ద్వారా ఙ్ఞాపకశక్తిని వృద్ది చేయడంతో పాటు మానసిక సమస్యలను దూరం చేస్తుంది. పిల్లల ఆలోచనా శక్తిని పెంచటానికి కూడా దీనిని తినవచ్చు.
అశ్వగంధ
అశ్వగంధశంఖ పుష్పి,అశ్వగంధ లు మెదడు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ తెలిపారు. ఈ హెర్భల్ టానిక్ లను ఉపయోగించడం వలన మీరు మీ ఙ్ఞాపకశక్తిని అధికం చేసుకోవచ్చు.ఈ రెండు ఔషధాలు మెదడు యొక్క బలాన్ని తగ్గకుండా నిరోధిస్తాయి.
Savings Scheme : సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్..
జింగో బిలోబా
ప్రపంచ వ్యాప్తంగా జింగో బిలోబా మెదడు పనితీరును వృద్ది చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వృధ్యాప్యంలో కూడా మెదడు పనితీరును యవ్వనంగా ఉంచుతుంది. ఇది రక్త ప్రసరణను,నరాల పనితీరును మెరుగు పరుస్తుంది.
రోజ్ మేరి
రోజ్ మేరీ ని ఉపయోగించడం ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది.తద్వారా చురుకుదనాన్ని కలిగిస్తుంది. ఎసిటైల్కోలిన్ నిరుపయోగం అవకుండా ఆపుతుంది.ఇది మెదడు యొక్క రసాయనం అభిఙ్ఞా పనితీరును,చూపు మరియు చురుకు దనాన్ని పెంచడంలో ముఖ్యమైనది.
లెసిధిన్
ఈ మిశ్రమం సోయాబీన్స్ మరియు గుడ్డు సొనలలో ఉంటుంది. ఇది అనేక కొవ్వుల కలయికలో ఏర్పడుతుంది. కణాలు సరిగా పనిచేయడం లో ముఖ్యమైనది. లెసిధిన్ వలన మెదడులో ఎసిటైల్కోలిన్ ఉత్పత్తికి కూడా సహాయకారిగా ఉంటుంది.
గమనిక : ఈ కధనం వివిధ మాధ్యమాలలో సేకరించిన సమాచారమే..మరింత సమాచారం కోసం మీ వైద్యులను సంప్రదించండి.వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.