Fixed Deposite Rates : FD ల మీద 3 సంవత్సరాలకు 9% వడ్డీ రేటును ఇచ్చే 4 బ్యాంక్ లు..

Telugu Mirror : ఫిక్సెడ్ డిపాజిట్ల వైపు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు మదుపరులు.గత సంవత్సరం నుండి ఫిక్సెడ్ డిపాజిట్ (FD) పై వడ్డీ రేట్లు వడిగా పెరిగాయి. బడా బ్యాంకులను వదిలేస్తే చాలా చిన్న బ్యాంక్ లలో కూడా ఫిక్సెడ్ డిపాజిట్ ల మీద 9 శాతం వరకు వడ్డీ రేట్లను కలిగి ఉన్నాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన చిన్నా పెద్దా తేడా లేకుండా FD లలో పెట్టుబడి పెడుతున్నారు. ఫిక్సెడ్ డిపాజిట్ ల ద్వారా గ్యారంటీ రాబడిని కలిగి ఉండి ప్రయోజనాలను పొందుతారు. 4 బ్యాంక్ లు మూడు సంవత్సరాలలో కాలపరిమితి ముగిసే ఫిక్సెడ్ డిపాజిట్ ల మీద అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD పై వడ్డీ రేటు :

ఈక్విటాస్ సూక్ష్మ ఫైనాన్స్ బ్యాంక్ వారు ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేటు 889 రోజుల నుండి 1095 రోజుల (3సంవత్సరాలు)మధ్యన కాల పరిమితి ముగిసే డిపాజిట్ లమీద 8 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.అదే కాల పరిమితిలో ముగిసే ఫిక్స్ డ్ డిపాజిట్ లు కలిగి ఉన్న సీనియర్ సిటిజన్ లకు ఈ బ్యాంక్ 8.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.

Fixed Deposite Rates : FD ల మీద 3 సంవత్సరాలకు 9% వడ్డీ రేటును ఇచ్చే 4 బ్యాంక్ లు..

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD మీద వడ్డీ రేటు :

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ ల మీద 1001 నుండి 1095 రోజుల మధ్య (3సంవత్సరాలు) కాల పరిమితి ముగిసిన ఫిక్స్ డ్ డిపాజిట్ లకు 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే, సీనియర్ సిటిజన్ లకు అదే కాల పరిమిత లో FD లపై 8.6 శాతం వడ్డీ రేటును ఇస్తున్నారు.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD లపై వడ్డీ రేటు:

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1000 రోజుల నుండి 1500 రోజుల మధ్యన కాలపరిమితి ముగిసి మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ ల మీద 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.సీనియర్ సిటిజన్ లకు అదే సమయంలో ముగిసే FD ల మీద 8.85 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తామని ప్రకటించారు.

LAW : తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారి FD ల పై వడ్డీ రేట్లు :

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారు రెండు నుండి మూడు సంవత్సరాల మధ్యన కాల పరిమితిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ ల పై 8.6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.సీనియర్ సిటిజన్ లకు అదే కాల పరిమితి కి FD ల మీద వడ్డీ రేటును 9.1శాతం వరకు అందిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.