6G Network : 6G సిగ్నల్ టెస్టింగ్ సక్సెస్, ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా ?
జపాన్ లో చాలా టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడంలో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ముఖ్యంగా DOCOMO, NEC, NTT వంటి జపనీస్ టెలికాం కంపెనీలు 6G ప్రోటోటైప్ పరికరాన్ని అభివృద్ధి చేయడంలో ముందడుగు వేశాయి.
6G Network : ఈ మధ్య కాలంలో దేశంలో టెక్నాలజీ అభివృద్ధి అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే సైంటిస్టులు కూడా చాలా వరకు అసాధ్యమైనవి కూడా సుసాధ్యాలుగా మారుస్తూ, ప్రజలకు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ఈ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే, మొన్నటివరకు 4G నెట్వర్క్ సరిపోతుందని అందరు అనుకున్నారు, అయితే 5G టెక్నాలజీ అందుబాటులోకి రానుండడంతో, అందరూ ఆనందిస్తున్నారు. దాంతో సంతృప్తి చెందకుండా ప్రస్తుతం 6జీ నెట్వర్క్ దిశగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చాలా మంది జపనీస్ టెలికాం ప్రొవైడర్లు తమ 6G నెట్వర్క్ అభివృద్ధి ప్రయత్నాలలో కీలకమైన దశకు చేరుకున్నారు.
Also Read:Google Wallet India: భారత్ లో గూగుల్ వాలెట్ ప్రారంభం, ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరూ వేగవంతమైన ఇంటర్నెట్ను కోరుకుంటున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ టెలికాం సంస్థలు ఇప్పటికే 5జీ ఇంటర్నెట్ (5G Internet) ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ప్రస్తుతం కొత్త 6G నెట్వర్క్ (6G Net Work) వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చాలా మంది జపనీస్ టెలికాం ప్రొవైడర్లు (Japanese Telecom Providers) తమ 6G నెట్వర్క్ అభివృద్ధి ప్రయత్నాలలో కీలకమైన దశకు చేరుకున్నారు. DOCOMO, NEC, NTT కార్పొరేషన్ మరియు ఫుజిట్సుతో సహా జపాన్ టెలికాం కంపెనీలు 6G ప్రోటోటైప్ పరికరాలను తయారు చేయడంలో ముందంజలో ఉన్నాయి. అలాగే, జపాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి 6G ప్రోటోటైప్‌ను రూపొందించింది. ఇది ఈ మధ్యనే పరీక్షించబడి విజయవంతమైంది. అయితే ఈ 6జీ ఇంటర్నెట్ స్పీడ్ 5జీ కంటే 20 రెట్లు ఎక్కువ అని చెప్తున్నారు.
అయితే, ఈ 5G నెట్వర్క్ వినియోగం భారతదేశంలో ఇటీవలే ప్రారంభమైంది. ఈ 6G నెట్వర్క్ సెకనుకు 100GB వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగలదు. ఇంకా, 5G సాంకేతికతతో పోల్చినప్పుడు ఇంటర్నెట్ గరిష్టంగా 10 Gbps వేగంతో ఉంటుందని వాదనలు ఉన్నప్పటికీ, నిజ-సమయ వేగం 200 నుండి 400 Mbps వరకు ఉంటుంది. జపనీస్ శాస్త్రవేత్తల ప్రకారం, ప్రస్తుత 6Gని 100 మీటర్ల వ్యాసార్థంలో పరీక్షించినట్లయితే, 300 GHz పరిధి అవుట్‌డోర్‌లో కూడా 100GBps కనెక్టివిటీ వేగం సాధించవచ్చు.
Comments are closed.