Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
ఫెస్ట్ విజయవంతంగా కొనసాగుతుంది. వసుధారా ఎండీగా ఫెస్ట్ ని విజయవంతంగా కొనసాగిస్తుంది. రిషిని వెతుక్కుంటూ రాజీవ్ రిషి ఉండే ప్రదేశానికి వెళ్తాడు. కానీ అక్కడ రిషి వాళ్ళు ఉండరు. అప్పటికే బయలుదేరిపోతారు. ఈలోపు శైలేంద్ర ఫోన్ చేసి దొరికారా అని అడుగుతాడకొంచంలో తప్పించుకున్నారు? అని రాజీవ్ సమాధానమిస్తాడు.
తప్పించుకోవడం ఏంటి? నేను అది చేస్తా ఇది చేస్తా భయపడకు భయ్యా అని ఏవేవో మాటలు చెప్పావ్ కదా అని శైలేంద్ర రాజీవ్ హోం గట్టిగా మాట్లాడాడు. మేడం వాళ్ళ అబ్బాయి కాబట్టి నువ్వు ఏమన్న పడుతున్న లేదంటే ఈ రాజీవ్ అంటే ఏంటో నీకు చూపించేవాడిని అని శైలేంద్రతో గట్టితో మాట్లాడతాడు. రిషి వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు,వెతి వెతికి పట్టుకొని చంపాక కాల్ చేస్తా అని రాజీవ్ శైలేంద్రతో చెబుతాడు.
కళ్ళు తిరిగి పడిపోయిన వసుధారా..
ఫెస్ట్ విజయవంతంగా కొనసాగుతుంది. ఫస్ట్ సక్సెస్ అయిందని అందరూ వసుధారాని మెచ్చుకుంటున్నారు. రిషి వాళ్ళు ఎక్కడ వరకు వచ్చారో కనుక్కోడానికి వసుధారా వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. ఆసుపత్రి సిబ్బంది నుండి ఫోన్ రావడంతో వసు షాక్ కి గురవుతుంది. ఇతను మీ నాన్నా? ఎవరో వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు అని ఆసుపత్రి లో పని చేసే ఒక మహిళ చెబుతుంది. మా నాన్న తో పాటు రిషి సర్ ఉండాలి కదా? అని వసు అడిగింది. హాస్పిటల్ లో వసు వాళ్ళ నాన్న తప్ప ఇంకెవ్వరూ లేరని ఆమె వసుకి చెబుతుంది. ఆ మాట వినగానే వసు కళ్ళు తిరిగి పడిపోతుంది.
టెన్షన్ లో వసుధారా..
వసుధారా మేలుకున్న తర్వాత అందరూ ఎలా ఉంది అని అడిగారు. నాకు బాగానే ఉంది అని చెప్పి, రిషి సర్ ఎక్కడ ఉన్నారు నాన్న అని వసుధార వాళ్ళ నాన్నను ప్రశ్నించింది. నన్ను ఎవరో తల మీద కొట్టారు? లేచి చూసేసరికి హాస్పిటల్ లో ఉన్నాను. మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదమ్మా అని చెబుతాడు. రిషి సర్ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అని చెప్పి శైలేంద్ర దగ్గరకి వెళ్తుంది.
శైలేంద్ర చంప చెల్లుమనిపించిన వసుధారా..
శైలేంద్ర బయటికి రారా, రిషి సర్ ఎక్కడ ఉన్నాడు? రిషి సర్ ని ఏం చేశావ్? అని శైలేంద్రని వసు ప్రశ్నించింది. రిషిని నేనేం చేస్తాను. నేనేం చేయలేదు అని శైలేంద్ర చెబుతాడు. నిజం చెప్పు అని శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది, చెంప దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఇంత దేవయాని వచ్చి కొట్టకుండా ఆపుతుంది.
మరి ఇంతకీ రిషి ఏమయ్యాడు. అటు భద్ర రిషిని చూడలేదని శైలేంద్రకు చెబుతాడు, ఇటు రాజీవ్ కూడా రిషి వాళ్ళని చూడలేదని చెబుతాడు. మరి రిషి ఎక్కడ ఉన్నాడు, ఏం అయ్యాడు అనే విషయం తెలియాల్సి ఉంది.