Telugu Mirror : Vivo కంపెనీ తన స్మార్ట్ ఫోన్(Smart Phone) ల పరంపరలో మరొక కొత్త ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మిడ్రేంజ్ ఫోన్ లకు మార్కెట్ ఎక్కువ.బడ్జెట్ ఫోన్ లను అన్ని బ్రాండ్ లు మరియు కంపెనీలు ఈ బడ్జెట్(Budget) ఫోన్ లపై ధృష్టి పెట్టి సక్సెస్ అవుతున్నాయి.
ఇదే క్రమంలో Vivo కంపెనీ కూడా తన కొత్త Y సిరీస్ లో నుంచి Y27 బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను భారత దేశంలో విడుదల చేసింది. 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి 12GB RAM తో 50- మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో ఈ ఫోన్ మీ బడ్జెట్ ఎంపికను గొప్పగా నిరూపిస్తుంది.Vivo Y27 ఫోన్ యొక్క ఫీచర్లు,ధర మరియు లభ్యత గురించి తెలుసుకుందాం.
Gold Prices : తెలుగు రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర..
ViVO Y27- ఫీచర్ లు,ధర,లభ్యత:
Vivo Y27 కొత్త స్మార్ట్ ఫోన్ 5G రేంజ్ ఫోన్ కాదు.ఇది Y27 4G స్మార్ట్ ఫోన్.అయితే ఈ ఫోన్ వెనుక భాగం 2.5D గ్లాస్ బాడీ కలిగి ఉంటుంది. 2388×1080 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉండి 6.44- అంగుళాల LCD FHD+ డిస్ ప్లే ప్యానెల్ ను కలిగి ఉంటుంది.ఇక కెమెరా విషయాని కొస్తే ఫోన్ వెనుక వైపున డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 50 మెగా పిక్సెల్ కలిగిన ప్రై మరీ సెన్సార్(Primary Sensor) మరియు 2 మెగా పిక్సెల్ లైన్స్ కలిగి ఉన్నాయి.Vivo Y27 ఫోన్ యొక్క కెమెరా సూపర్ నైట్ మోడ్, సూపర్ నైట్ సెల్ఫీ మోడ్, లైవ్ ఫోటో, స్లో- మో, టైమ్-లాప్స్ లాంటి ఫీచర్ లు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఫ్రంట్ పార్ట్ లో వాటర్ డ్రాప్ – నాచ్ డిజైన్ క్రింద సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 8- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది.
Fish With Human Teeth :మనిషిని పోలిన పళ్ళు ఉన్న చేపను చెరువులో పట్టుకున్నా 11 ఏళ్ల ఓక్లహోమా బాలుడు
ViVO Y27 స్మార్ట్ ఫోన్ Mediatek Helio G85 ప్రాసెసర్(Processor) చిప్ సెట్ ను కలిగి ఉంది.అదేవిధంగా 6GB RAM మరియు అదనంగా 6GB RAM వరకు విస్తరణచేసుకునే అవకాశం ఉంటుంది.ఈ డివైజ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 సపోర్ట్ పై Funtouch OS 13 మీద రన్ అవుతుంది.అలాగే ఫోన్ ఎడ్జ్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.Vivo Y27 హ్యాండ్ సెట్ లో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండి 44W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు కలిగి ఉంటుంది.
అలాగే బ్లూ టూత్ 5.0,USB టైప్-Cఛార్జింగ్(C-type),GPS , FM ,సేఫ్టీ కోసం,సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి కనెక్టివిటీ లను కలిగి ఉంది.ViVo Y27 బూర్గండి బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.భారత మార్కెట్ లో Vivo Y27 స్మార్ట్ ఫోన్ ధర 6GB RAM మరియు 128 GB అంతర్గత నిల్వ సామర్థ్యం కలిగిన మోడల్ రూ.14,999 కు లభిస్తుంది.Vivo Y27 స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్,అమెజాన్ మొదలైన వాటిలో కొనుగోలు చేయవచ్చు.