Brahmamudi serial feb 12th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారని అందరూ రాజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కావ్య రాజ్ కి ఫోన్ చేస్తే రాజ్ కావాలనే లిఫ్ట్ చేయడు. సుభాష్ రాజ్ పై కోపంగా ఉంటాడు.
కావ్య కళ్యాణ్ ని ఫోన్ చేయమని చెబుతుంది. క్లైంట్స్ వెయిట్ చేస్తున్నారు అందరి ముందు మామయ్య పరువు పోతుంది అని ఆలోచిస్తుంది కావ్య. కానీ రాజ్ కావ్యపై కోపంతో కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, శ్వేతని నన్ను చూసి కుళ్ళుకుంటున్నావా అని అన్నాడు. నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లే అని కళ్యాణ్ ఫోన్ నుండి చేస్తున్నావా అని అంటాడు. మాట్లాడేది తమ్ముడే అన్నయ్య, క్లైంట్స్ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతాడు. ఒక 10 నిమిషాల్లో వస్తా అని చెబుతాడు రాజ్.
మీటింగ్ ని విజయవంతం చేసిన కావ్య..
సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది అని సుభాష్ కి చెబుతుంది కావ్య. ఏంటి ఆ ఐడియా అని అడుగుతాడు. కావ్య మేడంకి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు కానీ రాజ్ సర్ కి నచ్చదు అని చెప్పింది శృతి. మరి ఈ మాట ఇప్పుడు చెబుతావేంటి? అని అంటాడు. సుభాష్ కావ్యని పిలిచి నీకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని విషయాలు తెలుసా అని అడుగుతాడు. హా తెలుసు మామయ్య అని కావ్య అంటుంది.
సరే క్లైంట్స్ కి నువ్వు వివరించు అని సుభాష్ చెబుతాడు. కానీ మామయ్య, రాజ్ కి ఇష్టం ఉండదు అని చెబుతాడు. మామయ్యగా చెబుతున్న పద అని సుభాష్ తీసుకెళ్తాడు. క్లైంట్స్ కి క్లియర్ గా కావ్య వివరిస్తుంది. మీటింగ్ ని సక్సెస్ చేస్తుంది.
ఆ అమ్మాయి ఎవరు ?
మీటింగ్ అయ్యాక రాజ్, శ్వేత ఇద్దరూ వస్తారు. రాజ్ మీరు మీటింగ్ మిస్ అయిన కాంట్రాక్టు మిస్ అవ్వలేదు. మీ మిస్సెస్ అన్ని మాకు వివరించారు అని క్లైంట్స్ చెప్పారు. అగ్రిమెంట్ రెడీ చేసుకోండి అని చెప్పారు.
క్లైంట్స్ వెళ్ళిపోయాక, ఎవర్రా ఈ అమ్మాయి అని సుభాష్ అడుగుతాడు. మీ అబ్బాయి గారి బెస్ట్ ఫ్రెండ్ మామయ్య అని చెబుతుంది కావ్య. అవునా? మరి బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు ఎందుకు ఇన్ని రోజులు పరిచయం చేయలేదు అని సుభాష్ అంటాడు.
అంటే ఈ మధ్యనే కలిసాం డాడీ అని రాజ్ చెబుతాడు. అదేంటి అన్నయ ఈ ఇద్దరు క్లాస్ మేట్స్ కదా అని అంటాడు. రాజ్ కవర్ చేస్తూ, హా అవును కానీ ఈ మధ్యనే మళ్ళీ కలిసాం అని చెబుతాడు రాజ్. సరే అండి, మీ ఫ్రెండ్ ని క్యాబిన్ కి తీసుకెళ్లి మర్యాదలు చేయండి అని కావ్య అంటుంది.
పోలీస్ అవ్వాలనే పట్టుదలతో అప్పు..
అప్పు తను చదువుకోడానికి ఇంట్లో అని సిద్ధం చేసుకుంటుంది. ఇక తన శిక్షణ పొందడానికి వాళ్ళ అమ్మకి ఏమి చేయాలో చెబుతుంది. కనకం, కృష్ణ మూర్తి ఇద్దరూ కూతుర్ని చూసి ఆనందపడతారు. మరి అప్పు కష్టం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.
రుద్రాణి, అనామిక ప్లాన్ రివర్స్..
అనిమాక అపర్ణ దగ్గరకు వచ్చి ఇవి మీరు కావ్య అక్కకి ఇచ్చిన తాళలే కదా పెద్ద అత్తయ్య అని అడుగుతుంది. అవును, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతుంది అపర్ణ. కావ్య అక్క రూమ్ ముందు కనిపించాయి అని అనామిక అంటుంది. దొరికింది ఛాన్స్ అంటూ ధాన్యలక్ష్మి అపర్ణ పై ఎగసి పడుతుంది. నా కోడలు అది ఇది అన్నావ్ గా ఇప్పుడు ఏమైంది? ఇంటి బాధ్యతని మట్టి కలిపింది అని అపర్ణని అంటుంది.
కానీ అపర్ణ కావ్యని ఒక్క మాట కూడా అనకుండా, నా కోడలు హడావిడిలో పొరపాటు చేసిందేమో కానీ కావాలని ఇలా చేయదు అని అంటుంది. అయిన దొరికిందా ఛాన్స్ అని మాటలు చాలా వస్తున్నాయి కానీ నేను ఏ రోజు ఐన నిన్ను తక్కువ చేసి మాట్లాడానా అని అపర్ణ అంటుంది. కావ్యన్ని వెనకేసుకొస్తుంది అపర్ణ.