Gold Rates Today 14-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? అయితే బంగారం కొనాలనుకునే వారు ఈ నెలలో బంగారం కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చే రెండు నెలల్లో పెళ్లిళ్ల ముహుర్తాలు రాబోతున్నాయి. కాబట్టి బంగారం రేట్ బాగా పెరుగుతుంది. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత రెండు రోజులుగా బంగారం తగ్గుముఖం పట్టగా, ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 నమోదు కాగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,830 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాల్లో Gold Rates Today 14-02-2024 ధరలు ఇలా ఉన్నాయి…
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 740 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,980 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,590 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,830గా నమోదయింది.
చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090, 24 క్యారట్ల బంగారం ధర రూ.63, 370 వద్ద నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.76,900 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,400 వద్ద నమోదయింది, బెంగుళూరు లో కిలో వెండి పై రూ.100 తగ్గింది దీంతో అక్కడ ధర రూ.72,850 వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,590 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,830గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.