Brahmamudi serial feb 14th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో రాజ్ కావ్యని వాళ్ళ పుట్టింటి దగ్గర దింపుతాడు. కనకం వెంటనే వెళ్లి అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఇంట్లోకి రండి అని మర్యాదగా మాట్లాడుతుంది. లేదండి, నేను వెళ్ళాలి..కళావతి కార్ పాడయితే నేను దింపడానికి వచ్చాను. నాకు కొంచం పని ఉంది అని రాజ్ కనకం తో అంటాడు. కనీసం టీ అయిన తాగి వెళ్ళు అని అంటుంది కనకం. ఇంతలో కావ్య, ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు, పోవాలి అనుకునే వారు తప్పించుకోడానికి సాకులు వెతుకుతారు అని చెప్పి కోపంగా ఇంట్లోకి వెళ్తుంది.
రాజ్ పని ఉంది అని చెప్పి వెళ్తాడు. అక్కడ ఎదో జరిగింది కనకం మన అమ్మాయిని అడుగుదాం పద అని ఇంట్లోకి వెళ్తారు. కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని అడిగితే, మీ అల్లుడు గారు వేరే అమ్మాయితో తిరుగుతున్నారు అమ్మ అని కావ్య ఏడుస్తూ చెబుతుంది. అందరూ షాక్ అవుతారు. అల్లుడు గారు ఇలా చేయడం ఏంటి అని కనకం అంటుంది. ఆ ఇంట్లో కొద్దిగా మంచిగా ఉండేవాడు అంటే బావే. ఇతను కూడా ఇలా చేస్తున్నాడా? నువ్వు ఇలా ఉంటె కష్టం అక్క..పోలీస్ కేసు పెట్టిద్దాం అవసరం అయితే కోర్ట్ కి కూడా వెళ్తాను అని అప్పు అంటుంది.
Brahmamudi serial feb 14th episode
ఇక కట్ చేస్తే రాజ్, సుభాష్ అందరూ ఇంటికి వస్తారు. మీతో మాట్లాడాలి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆవిడ గారు ఇంకా రాలేదా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి..ఎవరి గురించి అడుగుతున్నావు పిన్ని కళావతి గురించా అని అంటాడు రాజ్, అవును ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. ఎందుకు పిన్ని ఏదైనా సమస్య వచ్చిందా అని రాజ్ అడుగుతాడు. అవును ఇంట్లో నుండి రెండు లక్షలు దొంగతనం చేసింది అని చెబుతుంది.
మీ అమ్మ లాకర్ తాళాలు మీ భార్యకి ఇచ్చింది. వెంటనే అందులో నుండి రెండు లక్షలు తీసుకుంది అని ధాన్యలక్ష్మి కావ్యని అంటుంది. తనకి ఏమైనా అవసరం ఉన్నాయేమో అందుకే తీసుకొని ఉంటుంది అందులో తప్పేం ఉంది అని రాజ్ అంటాడు. ఆ రెండు లక్షల కోసమా ఇంత గొడవ అని సుభాష్ అంటాడు.
కావ్య ఎక్కడా అని అడిగితే తన పుట్టింటికి వెళ్తా అంటే అక్కడ దింపేసి వచ్చా అని రాజ్ అంటాడు. ఇంకేం ఉంది ఈ డబ్బు అక్కడికి చేరవేసింది అనుకుంట అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆపు పిన్ని, నా భార్యని అనే అధికారం ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని రాజ్ అంటాడు. సుభాష్ కూడా నీకు అధికారం ఉంది కానీ అధికారం వేరు అనుమానం వేరు అని సుభాష్ చెప్పి వెళ్తాడు.
మీ బావగారికి నేను అంటే ఇష్టం లేదు. వేరే అమ్మాయిని అడ్డుపెట్టుకొని నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. అందుకే నేను కూడా అతని వదిలేస్తాను అని అంటుంది కావ్య. ఇంతలో అమ్మమ్మ గారు వచ్చి వదిలేసి ఏం చేస్తావ్ అని అంటుంది.