Xiaomi A Series: లేటెస్ట్ షావోమీ స్మార్ట్ టీవీ.ఫ్రీ గా చానల్స్ చూడవచ్చు

Xiaomi Smart TV A సీరీస్ తాజాగా మార్కెట్ లో విడుదలయ్యాయి. ఈ A సీరీస్ లో మూడు స్క్రీన్ సైజ్ లు అందు ధర రూ.14,999 ఆఫర్ లపైన 1000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Xiaomi Smart TV 40A ( 40-inches ) వేరియంట్ యొక్క ధర రూ.22,999 మరియు Xiaomi Smart TV 43A ( 43-inches ) యొక్క ధర రూ.24,999. మీరు ఒక వేళ Xiaomi Smart TV 40A ని కొనడం కంటే Smart TV 43A ను కొనడం మంచిదని చెప్పవచ్చు. జూలై 25 రాత్రి 12 గంటల నుంచి ఇతర స్టోర్ లలో ఈ టీవీలను కొనవచ్చు.

మూడు Smart TV లు కూడా Xiaomi యొక్క వీవిడ్ పిక్చర్ ఇంజిన్ తో వస్తున్నాయి. అలానే గూగుల్ టీవీ మరియు Xiaomi యొక్క ప్యాచ్ వాల్ UI తో నడుస్తాయి. ప్యాచ్ వాల్+ ను కలిగి ఉండటం ద్వారా ఈ స్మార్ట్ టీవీలు 200 పైగా లైవ్ ఛానల్ లను కలిగి ఉన్నాయి. ఈ ఛానల్స్ చూడటానికి మనం చార్జెస్ ఏమి కట్టనక్కర్లేదు, వీటిని ఫ్రీ గానే చూడవచ్చు. అలానే గూగుల్ టీవీ తో నడుస్తుంది కాబట్టి Google Chromecast ఫీచర్ కూడా ఈ టీవీలలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ తో మన ఫోన్ ను టీవీ కి కనెక్ట్ చెయ్యవచ్చు, దాంతో సినిమాలు, టీవీ షో లను చూడవచ్చు. అలానే YouTube వీడియోలను కూడా మనం చూడవచ్చు. YouTube Music లోని పాటలను మనం ప్యాచ్ వాల్+ నుండే వినవచ్చు.

మూడు Smart TV లు 1.5GB RAM మరియు 8GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో వస్తున్నాయి. అలానే Quad Core A35 చిప్ సెట్ ను ఈ మూడు టీవీలు కలిగి ఉన్నాయి.

ఈ Smart TV లు వీవిడ్ పిక్చర్ ఇంజిన్ కలిగిన full HD + డిస్ ప్లే ను కలిగి ఉన్నాయి. అలానే డాల్బీ ఆడియో మరియు DTS Virtual:X సపోర్ట్ కలిగిన 20W స్పీకర్ లు మూడు టీవీలు కలిగి ఉన్నాయి. అన్ని స్మార్ట్ టీవీలు క్విక్ మ్యూట్, క్విక్ వేక్ మరియు క్విక్ సెట్టింగ్స్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్న బ్లూటూత్ రిమోట్ తో వస్తాయి. అలానే డ్యుయల్ బాండ్ WiFi , బ్లూటూత్ V5 కనెక్టివిటీలను కలిగి ఉంది. ARC, ALLM HDMI పోర్ట్ లను సపోర్ట్ చేస్తుంది. అలానే రెండు USB పోర్ట్ లు మరియు హెడ్ ఫోన్ జాక్ ను కలిగి ఉన్నాయి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in