Brahmamudi serial feb 19th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, అనామిక ధాన్యలక్ష్మి వద్దకు వచ్చి మీ అబ్బాయి క్రెడిట్ కార్డ్స్ అన్ని ఆ కావ్య దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని అన్న కూడా ఆమె దగ్గరికి వెళ్లి అడుక్కోవాలా? ఆ కావ్య అంటే మిడిల్ క్లాస్ నుండి వచ్చింది కాబట్టి అడుక్కోవడం అలవాటు అయింది కానీ నేను రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి నాకు ఆమె దగ్గరికి వెళ్లి అడగాలంటే నామోషీగా ఉంటుంది అందుకే కావ్య ఆఫీసుకు వెళ్తుంది కాబట్టి ఇంటి పెత్తనం మీకైనా నాకైనా ఇవ్వమని అడగండి అని అనామిక ధాన్యలక్ష్మికి చెబుతుంది.
నా కోడలికి ఇంటి పెత్తనం ఇవ్వండి..
ఇంటి సభ్యులందరి ముందు ధాన్యలక్ష్మి కావ్యని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇన్ని రోజులు అపర్ణ అక్క పెత్తనం చెలాయించి నన్ను అణగదొక్కింది ఇప్పుడు ఆమె కోడలు పెత్తనం చెలాయిస్తే నా కోడలు చూస్తూ ఊరుకోవాలా అని ధాన్యలక్ష్మి విరుచుకుపడుతుంది. కావ్య ఆఫీసుకు వెళ్తుంది కాబట్టి నా కోడలికి అధికారం ఇవ్వమని అడుగుతుంది. స్వప్న గట్టిగా అరుస్తుంది.. దీని కోసమా ఇంత ప్రయత్నం, కావ్యకి పెత్తనం ఇవ్వడం ఈమెకి మొదటి నుండే ఇష్టం లేదు. అందుకే 2 లక్షలు పోయాయి అని కావ్య మీద నింద వేయాలని చూసింది. ఇప్పుడు పెత్తనం కావాలి అని చూస్తుంది అందుకే ఇలా చేస్తుంది అని స్వప్న అన్నది.
Brahmamudi serial feb 19th episode
ఇన్ని రోజులు తీసుకోని నిర్ణయం ఇప్పుడు అమలు చేయాల్సి వస్తుంది అని అపర్ణ అంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకుంటే మంచిది అని అపర్ణ అందరికీ చెప్పి వెళ్తుంది. ఇక అందరూ వాళ్ళ భార్యల చేయి పట్టుకొని వెళ్ళిపోతారు.
కళావతి వాళ్ళ బావని తీసుకొస్తుంది అంట..
కళావతి వాళ్ళ బావని తీసుకొస్తా అని చెప్పి రెండు గంటలు అవుతుంది ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు రాజ్. శృతిని పిలిచి మీ మేడం ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతాడు. నాకు తెలియదు సార్ అని శృతి చెబుతుంది. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావ్ కదా స్టాఫ్ రాకపోతే ఎందుకు రాలేదు అని తెలుసుకోవాలి అని తెలియదా అని రాజ్ సీరియస్ అవుతాడు. మీ ఇద్దరు ఇంట్లోనే ఉంటారుగా సార్ మీకు తెలియనిది నాకు ఎలా తెలుస్తుంది అని శృతి అంటుంది. ఇంతలో శ్వేత వస్తుంది. ఎదో పార్టీ ఇస్తా అన్నావ్ ఏంటి అది అని అంటుంది. ఆఫీసులో లో అయితే కావ్య చూసి బాధపడాలి అనేగా నీ ఉద్దేశం అని శ్వేత అంటుంది.
అలా జరగాలి అంటే కావ్య ఆఫీసులో ఉండాలి కదా అని రాజ్ అంటాడు. కావ్య ఆఫీసుకి రాలేదా అని శ్వేత అడుగుతుంది. కావ్య ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. వాళ్ళ బావ వస్తున్నాడు అంట అని జలస్ గా రాజ్ ఫీల్ అవుతాడు. కావ్య ఊసే తీసుకొచ్చి మాట్లాడతాడు రాజ్.