LPG Gas Price : ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఈ రోజు (మార్చి 1వ తేదీ శుక్రవారం నాడు) నుంచి 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరను రూ. 25 పెంచాయి. ఇటీవలి ధరల పెరుగుదల కారణంగా ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ 1,795గా ఉంది. నేటి నుండి, ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,749 గా అమ్మబడుతుంది. తాజా పెంపుతో చెన్నై మరియు కోల్‌కతాలో వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధర వరుసగా రూ. 1,960 మరియు రూ. 1,911కి పెరిగింది.
ప్రభుత్వరంగ సంస్థలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 1న 19 కిలోల పెట్రోల్ సిలిండర్ ధర రూ. 14 పెరిగింది.
చమురు కంపెనీలు డిసెంబర్ 1, 2023న దేశవ్యాప్తంగా వాణిజ్య పెట్రోల్ సిలిండర్ ధరలను రూ. 21 పెంచాయి.
నూతన సంవత్సరం 2024 సందర్భంగా, 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ ధరలు సిలిండర్‌కు 39.50 తగ్గాయి.
ప్రభుత్వ అధీనంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గత నెల సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి.
( మరిన్ని వివరాలు రానున్నాయి)