YSR Cheyutha 4th Installment Released : మహిళల అకౌంట్ లోకి రూ.18750, చేయూత నాలుగో విడత నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

YSR Cheyutha 4th Installment Released

YSR Cheyutha 4th Installment Released : వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. ఇప్పుటికే మూడు విడతలు నిధులు విడుదల చేయగా.. తాజాగా గురువారం నాలుగో విడుత నిధుల విడులకు సబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. ఈ పథకం కింద మొత్తం 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారు. వారందరికీ ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.14, 129 కోట్లు అందించారు.

వైఎస్ ఆర్ చేయూత పథకాన్ని 2020 ఆగష్టు 12న ₹17000 కోట్ల బడ్జెట్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు . ఈ పథకాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు వర్తింపజేశారు. అర్హత వయస్సు 45–60 సంవత్సరాలుగా నిర్ణయించారు. మహిళలు సంవత్సరానికి ₹18750 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల కాలంలో మొత్తం ₹75000 తీసుకోనున్నారు. 2020 ఆగస్టు 12న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మొదటి విడత 18750 రూపాయలు జమ చేయబడ్డాయి. ఇప్పటికే మూడు విడుతలు కంప్లీట్ కాగా.. నాలుగో విడుత నిధుల విడుదలకు సబంధించి జగన్ మోహన్ రెడ్డి గురువారం బటన్ నొక్కారు.

45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల బలహీన సామాజిక వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం చేయడానికి వైఎస్సాఆర్ చేయూత ప్రవేశపెట్టబడింది. వారిని అభివృద్ధి చేయటానికి అమూల్ , పీ అండ్ జీ, ఐటీసీ లిమిటెడ్ , హిందూస్తాన్ యూనిలీవర్, అల్లానా గ్రూప్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లతో ఒప్పందాలు కుదిరాయి. ఉత్పత్తి రంగాన్ని ఎంచుకునే మహిళలు కంపెనీలచే శిక్షణ పొందుతారు. వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను తిరిగి కొనుగోలు చేస్తారు. మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకునే మహిళలు తమకు నచ్చిన ఉత్పత్తులను తక్కువ రేటుకు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వబడింది. వాటిని రిటైల్ రంగంలో లాభాలకు అమ్ముకోవచ్చు. మహిళల్లో నైపుణ్యం పెంచి వారి కాళ్లమీద వారిని నిలబడేలా చేయటమే వైఎస్ ఆర్ చేయూత ప్రధాన ఉద్దేశం..

Also Read : PM Kisan 16th installment : రైతులకు పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడు అందుతుందో తెలుసా?

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in