Telugu Mirror : ఆండ్రాయిడ్ ఉపయోగించే వారికోసం ChatGpt ఇప్పుడు Google ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది.IOS యాప్ ను ChatGpt కోసం ప్రారంభించిన తరువాత OpenAI తన AI చాట్ బాట్ ను ఆండ్రాయిడ్ వినియోగించే వారికి కూడా అందుబాటు లోకి తీసుకు వచ్చింది.
ChatGpt ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్(Android) ఉపయోగించే వారందరకీ అందుబాటులో లేదు. కానీ కొన్ని ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే వినియోగంలో ఉంది.
Today Rashi Phalam: నేటి రాశి ఫలం, డైలీ జాతకం 26-జూలై-2023
OpenAI తాజాగా చేసిన ట్వీట్(Tweet) లో AI Chatbot ఇప్పుడు ప్రత్యక్షంగా US,ఇండియా,బంగ్లాదేశ్ మరియు బ్రెజిల్ లోని Google Play Store లో అందుబాటులోకి వచ్చింది అని ట్వీట్ లో తెలియజేసింది. Open AI తన ట్వీట్ లో “ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ChatGpt ఇప్పుడు US లోనూ అలాగే భారత్,బంగ్లాదేశ్,బ్రెజిల్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వచ్చే వారంలో రోల్ అవుట్ ను మరికొన్ని దేశాలకు విస్తరింపచేయాలని చేయాలని ఆలోచన చేస్తున్నాం.” అని OpenAI ట్వీట్ చేసింది.
Google Play స్టోర్ లో OpenAI ChatGpt ని డౌన్ లోడ్ ఎలా చేయాలి?
- మీ ఆండ్రాయిడ్(Android) స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేసి, ప్లే స్టోర్ అప్లికేషన్ ని సందర్శించండి.
- ప్లే స్టోర్ లో ChatGpt ని వెతకండి. OpenAI మేకర్ గా ఏదైతే ఉందో దానిని డౌన్ లోడ్ చేసుకోండి.
- మీ స్మార్ట్ ఫోన్ లో అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్(Install) చేసుకోండి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ల కోసం ChatGpt
Heavy Rains in Telangana: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. నేడు రేపు పాఠశాలలకు సెలవు
AI చాట్ బాట్ ఇప్పటివరకు కొన్ని దేశాలలోనే అందుబాటులో ఉన్నది.ఈ యాప్ ను అధిక ప్రజాదరణ పొందిన దేశాలలోనే అందుబాటులో ఉంది. మల్టీ టాస్కింగ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ చాట్ బాట్(Artificial intelligent chat bot) ని వివిధ రకాల ప్రయోజనాలకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.దీనిని ఎక్కువగా కంటెంట్ వ్రాయడానికి మరియు కోడింగ్ కోసం ఉపయోగిస్తారు. శాన్ ఫ్రాన్సిస్కో(San Francisco) కు చెందిన OpenAI గత వారంలోనే ప్లే స్టోర్(Play Store) లో చాట్ బాట్ అందుబాటులోకి రానుందని తెలిపింది.సామ్ ఆల్ట్ మన్ సీఈఓ గా ఉన్న ఓపెన్ AI సంస్థ 2022 నవంబర్ లో ChatGPT ను విడుదల చేసింది.
అప్పటి నుంచి ఇంటర్ నెట్ రూపురేఖలే మారిపోయాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలకు ChatGPT చమట పట్టించిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఈ కంపెనీలు కూడ వాళ్ళ AI అసిస్టెంట్ ల పైన దృష్టి సారించాయి. బార్డ్(Bard) అనే పేరుతో గూగుల్ ఒక AI చాట్ బాట్ ను తయారు చేస్తుంది, అలానే మైక్రోసాఫ్ట్ బింగ్(Microsoft Bing) అనే AI చాట్ బాట్ ను ఆవిష్కరించింది. ChatGPT కోడింగ్ కూడా చెయ్యగలదు, మనం అడిగే ఏ ప్రశ్నకైన ChatGPT సమాధానం ఇవ్వగలదు. అలానే ఈ సంవత్సరం మే లో iOS ప్లాట్ ఫామ్ లో ChatGPT విడుదల అయ్యింది.