Virat Kohli : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ..!

https://telugumirror.in/sports/good-news-for-rcb-fans-virat-kohli-is-back/

Telugu Mirror : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టీమిండియా రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి IPL 2024లో పాల్గొనడానికి భారత గడ్డపై అడుగు పెట్టాడు. ఈరోజే అతను ముంబై విమానాశ్రయంలో దిగినట్లు సోషల్ మీడియా లో ఫోటో లు వైరల్ అయ్యాయి.

విరాట్ భార్య అనుష్క శర్మ ఇటీవల లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. పాప పేరు అకాయ్ (Akai) అని విరాట్, అనుష్క శర్మ సోషల్ మీడియాలో ప్రకటించారు. కుటుంబంతో గడిపేందుకు లండన్ (London) వెళ్లిన కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు.

Also Read : Indian Bank Jobs 2024: ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు అర్హతలు ఇవే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

ఐపీఎల్ 2024 మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. దీంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓపెనింగ్ మ్యాచ్ సమయానికి బెంగళూరు వస్తాడో లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ అప్డేట్ తో బెంగళూరు ఫ్యాన్స్ చాల సంతోషిస్తున్నారు.  సుదీర్ఘ విరామం తర్వాత కింగ్ కోహ్లి బ్యాట్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

good-news-for-rcb-fans-virat-kohli-is-back

విరాట్ కోహ్లీ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. విరాట్‌ని చూడగానే అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చాలా మంది అభిమానులు కోహ్లితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఎలా ఉన్నారని ఫ్యాన్స్ అడగ్గా, దానికి కోహ్లి బాగున్నాను అని చెప్పాడు. ఈ నెల 19న ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ (RCB Unbox Event) నిర్వహించనున్నారు. RCB నిర్వహించే ఈ ప్రఖ్యాత ఈవెంట్‌లో కోహ్లీ కనిపించనున్నాడు. అదే రోజున RCB తన జెర్సీని విడుదల చేయనుంది.

Also Read : WPL Final 2024 : నేడే ఆఖరి పోరు.. చరిత్ర సృష్టించి టైటిల్ ను గెలిచేది ఎవ‌రు..?

కోహ్లీ ఐపీఎల్ రికార్డులు :

ఐపీఎల్‍లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 16 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ 237 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 7,263 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక ఐపీఎల్ సెంచరీల రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‍కు సంబంధించి తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ వెల్లడించింది. తొలి 21 మ్యాచ్‍లను ఖరారు చేసింది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in