Telugu Mirror : అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడేందుకు వ్యక్తిగత రుణాలు అనేవి చాల ముఖ్యమైనవి. దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఇతర గృహ రుణాలు, బంగారు రుణాలు లేదా వాహన రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఈ లోన్ తీసుకునేందుకు ఏ వస్తువు తాకట్టు పెట్టని కారణంగా వీటిని అన్సెక్యూర్డ్ రుణాలు అంటారు. వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు బ్యాంకుల వారీగా మారుతూ ఉంటాయి. అంతటా ఒకేలా ఉండవు.
దరఖాస్తుదారుడి వయస్సు, క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆదాయం మరియు అదనపు ఆదాయ వనరుల ఆధారంగా రుణాలు మంజూరు చేయబడతాయి. పెద్ద బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేస్తాయి, ప్రాసెసింగ్ ఫీజు ఎంత మరియు రూ. 5 లక్షల వ్యక్తిగత రుణానికి EMI ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : raithu barosa update 2024: రైతు భరోసా పై బిగ్ అప్డేట్, మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
HDFC బ్యాంక్ :
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యల్ప వడ్డీ రేటు అందిస్తోంది. ఏడాదికి 10.50శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 10,747 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1 లక్షకు, ఇది రూ. 2,149 నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 4,999 వరకు ఉంటుంది.
SBI బ్యాంక్ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాదికి 11.15శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 10,909 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1 లక్షకు, ఇది రూ. 2,182 నుంచి ప్రారంభమవుతుంది. లోన్ మొత్తంలో 1.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా :
బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 11.05 నుండి 18.75 శాతం వరకు ఉంటాయి. 5 లక్షల రుణానికి EMI రూ. 12,902 నుండి ప్రారంభం అవుతుంది. రూ. 1 లక్షకు, ఇది రూ. 2,177 నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 2580 వరకు ఉంటుంది.
Also Read : Indian Bank Jobs 2024: ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు అర్హతలు ఇవే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
యాక్సిస్ బ్యాంక్ :
యాక్సిస్ బ్యాంక్ అత్యల్ప వడ్డీ రేటు అందిస్తోంది. ఏడాదికి 10.49 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 10,744 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1 లక్షకు, ఇది రూ. 2,149 నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 4,999 వరకు ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ :
మహీంద్రా బ్యాంక్ ఏడాదికి 10.99 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 10,869 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1 లక్షకు, ఇది రూ. 2,174 నుంచి ప్రారంభమవుతుంది. లోన్ మొత్తంలో 3% వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.