Allu Arjun: ఆంధ్రాలో కూడా తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..త్వరలోనే మల్టీప్లెక్స్‌ ప్రారంభం.

Allu Arjun is planning a multiplex business in Vizag will start soon.

Telugu Mirror : ప్రస్తుతం సినిమా తారలు తమ సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలలో కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవల, మన హీరోలు ముఖ్యంగా మల్టీప్లెక్స్ (Multiplex) కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ల రంగంలో ఏషియన్ సినిమాలతో పాటు మన హీరోలు కూడా థియేటర్లను ప్రారంభిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే మహేష్ బాబు AMB మల్టీప్లెక్స్, అల్లు అర్జున్ AAA సినిమాస్ మరియు విజయ్ దేవరకొండ AVD సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి.

Also Read : New Voter List : కొత్త ఓటర్ల జాబితా వచ్చింది.. మీ ఓటుని ఇప్పుడే చూసుకోండి..

ఈ మల్టీప్లెక్స్‌లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. రవితేజ త్వరలో హైదరాబాద్‌లోని దిల్‌షుఖ్ నగర్‌లో ఏఆర్‌టీ సినిమాస్‌ను ప్రారంభించనున్నారు. అయితే అల్లు అర్జున్ తన AAA సినిమాస్ వ్యాపారాన్ని వైజాగ్‌లో (Vizag) కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల పుష్ప సినిమా షూటింగ్ కోసం బన్నీ వైజాగ్ వెళ్లినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. వైజాగ్‌లో పెద్ద సినిమా పరిశ్రమ కూడా ఉంది.

Allu Arjun is planning a multiplex business in Vizag will start soon.

వైజాగ్‌లో ఆర్బిట్ మాల్ (Orbit Mall) త్వరలో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ ఈ మాల్‌లో ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) పక్కన AAA సినిమాస్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. హైదరాబాద్ AAA మల్టీఫ్లెక్ చూడటానికి చాలా బాగుంటుంది, క్లాస్ అప్పియరెన్స్ మరియు అల్లు అర్జున్ ఫోటోగ్రాఫ్‌లతో చాల అద్భుతంగా ఉంటుంది. అదే రేంజ్‌లో వైజాగ్‌ లో కూడా ఒక మల్టిఫ్లెక్ ప్రారంభించే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడు అని తెలుస్తుంది.. వైజాగ్‌లో ఏఏఏ (AAA) సినిమాస్ ఎప్పుడు తెరుచుకుంటాయోనని అభిమానులు చాల ఆత్రుతగా ఉన్నారు.

Also Read : Karthikeya 3 : బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో రిపీట్..కార్తికేయ 3 పై బిగ్ అప్డేట్..

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజిబిజీగా ఉంటున్నాడు అర్లు అర్జున్. గతంలో రిలీజై పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప 1 సినిమాకు మించి క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. . ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప2 సినిమా రిలీజ్ కానుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in