Insurance Plan : కేవలం రూ. 575 తో రూ. 25 లక్షల ప్రమాద బీమా.. అదిరిపోయే పాలసీ ఇప్పుడే చేరండి..!

Personal Accidental Insurance policy

Insurance Plan : కరోనా మహమ్మారి తర్వాత ఇన్సూరెన్స్ (Insurance) పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజు కి పెరుగుతుంది. బీమా తీసుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉండదనే అవగాహన ప్రజల్లో ఏర్పడిందనే చెప్పాలి. ఇన్సూరెన్స్ పాలసీ (Insurance policy) తీసుకునే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. చాలా ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. టర్మ్ ప్లాన్ (Term plan) నుంచి ఆరోగ్య బీమా, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (Accidental Insurance) కవరేజీ వంటివి ఉన్నాయి. కేవలం ఒకదానికే పరిమితం కాకుండా అన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ కలిగి ఉండటం ఉత్తమం. అప్పుడు మీ పై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మీరు లేకున్నా కూడా ఎలాంటి ఆర్థిక కష్టాలు రాకుండా ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ సహాయపడతాయి.

Also Read : Bank Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎలాంటి పరీక్ష లేకుండానే బ్యాంక్ ఉద్యోగం..

ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్(Personal accident coverage) ప్లాన్ గురించి తెలుసుకందాం. ఈ ప్లాన్ లో మీరు తక్కువ ప్రీమియంతో అధిక భీమా కవరేజీని పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణిస్తే మీ కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము అందుతుంది. డ్రైవర్లు, ప్రధానంగా ఆటోమొబైల్స్, బస్సులు లేదా ట్రక్కులను నడుపుతున్నట్లయితే ఈ బీమాను కలిగి ఉండటం ఉత్తమం. సొంత వాహనం లేని వారికి కూడా ఈ పాలసీ అనువైనది.

Rs.25 lakh accident insurance with just Rs.575 premium
ఆదిత్య బిర్లా (Aditya Birla) కంపెనీ తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమాను అందిస్తుంది. కేవలం మీరు సంవత్సరానికి రూ. 575 ప్రీమియం తో 25 లక్షల వరకు ప్రమాద బీమా (Accident insurance) పాలసీ పొందవచ్చు ఇంకా, మీకు పది లక్షల రూపాయల వరకు కవరేజీ కావాలంటే, మీరు కేవలం 230 రూపాయల ప్రీమియం చెల్లించాలి. అంటే లక్షకు ప్రీమియం 23 రూపాయలు అవుతుంది. ఈ పాలసీ కేవలం ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒక సంవత్సరం తర్వాత ఈ పాలసీ గడువు ముగుస్తుంది. మీరు పాలసీని కొనసాగించాలి అనుకుంటే, మీరు మళ్లీ ప్రీమియం రుసుమును చెల్లించాలి.

Also Read : Railway Ticket QR Code : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో పేమెంట్ చేయొచ్చు..

ఈ పాలసీ 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో ఉంది. అయితే, మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరియు ఉగ్రదాడి వల్ల మరణం సంభవించినా పాలసీ కవరేజ్ వర్తించదు. అంతేకాకుండా ప్రమాదంలో కొంచెం  గాయపడినప్పటికీ, పాలసీదారుకు పూర్తి పాలసీ అందదు. మీరు ప్రమాదంలో చనిపోతే లేదా శాశ్వతంగా అంగవైకల్యం చెందితే మాత్రమే పాలసీని క్లెయిమ్ చేయవచ్చు.

Personal Accidental Insurance policy

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in