Ford EcoSport 2024
Ford EcoSport 2024 : ఫోర్డ్ ఎండీవర్ ఇండియా లో ఒక ట్రక్ లో లోడ్ చేసుకొని మూవ్ చేస్తున్నప్పుడు కనిపించింది, ఇది భారతీయ మార్కెట్లోకి ఎండీవర్ త్వరలో రాబోతున్నట్టు తెలుపుతుంది. బోల్డ్ డిజైన్‌కు పేరుగాంచిన ఈ కారు త్వరలో ఇండియన్ రోడ్స్ పై టెస్టింగ్ చేస్తూ కనిపించే అవకాశం ఉంది. కొత్త ఎండీవర్ లో ఇంజిన్ ఒప్షన్స్ కూడా మారే అవకాశం ఉండవచ్చు. అలాగే ఫోర్డ్ కంపెనీ నుంచి ఇంకో వెహికల్ రిలీజ్ అవబోతున్నట్టు ఆటోమొబైల్ వర్గాలు చెప్తున్నాయి, అది ఏంటో ఇపుడు చూద్దాం.
ఫోర్డ్ రీసెంట్ గా మరొక కార్ కోసం పేటెంట్ ఫైల్ చేసింది. సబ్-4-మీటర్ SUV లేదా మిడ్-సైజ్ SUV అయి ఉండవచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న క్రెటా మరియు కియా సెల్తోస్ వంటి కార్ ల సైజ్ తోనే ఈ వెహికల్ ఉంటుంది అని చెప్తున్నారు, ఇవి సైజ్ లో పెద్దవి కావు కానీ ఈ వెహికల్ కి చాల కాంపిటీషన్ అందిస్తాయి. ఫోర్డ్ తన ఫేమస్ మోడల్ అయిన ఏకో-స్పోర్ట్ యొక్క పేస్-లిఫ్ట్ ని తిరిగి రిలీజ్ చేయడానికే ఈ పేటెంట్ ఫైల్ చేసినట్టు నిపుణులు చెప్తున్నారు.
Ford EcoSport 2024 Exterior
కొత్త ఏకో స్పోర్ట్ యొక్క డిజైన్ స్మార్ట్‌గా కనిపిస్తుంది, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్‌లు మరియు లోయర్ బంపర్ సిల్వర్ మరియు బ్లాక్ కలర్ లుక్ తో వస్తుంది. సైడ్ ప్రొఫైల్ చాల ఆకర్షియనీయం కనిపిస్తుంది మరియు అల్లాయ్ వీల్ డిజైన్ ఔత్సాహికుల బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
Ford EcoSport 2024 Interior
ఈ కార్ ఇంటీరియర్ విషయానికి వస్తేయ్, కార్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫిజికల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో విలాసవంతమైన ఇంటీరియర్ తో వస్తుంది. USB పోర్ట్‌లు, గేర్ నాబ్, ఆటో హోల్డ్ మరియు ఎక్కువ స్పేస్ తో, ఇలా ఎన్నో రకాల ఫీచర్స్ తో ఈ కార్ చాల ఆకర్షణీయం గ కనిపిస్తుంది. ఇంటీరియర్ యాంబియంట్ లైటింగ్ మరియు ప్లాస్టిక్ మరియు వుడ్ ట్రిమ్ తో డిజైన్ చేసారు.
Ford EcoSport 2024 Engine Options
ఇంజన్ల పరంగా, యూరోపియన్ మార్కెట్లో సాధారణమైన 1.5-లీటర్ ఇ-బూస్ట్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో సహా రెండు ఒప్షన్స్ వచ్చాయీ అవకాశాలు ఉన్నాయ్. హైబ్రిడ్ వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఇది ఆల్-వీల్ డ్రైవ్‌తో 177 హార్స్‌పవర్‌ను అందిస్తుంది. మరొక వేరియంట్ 180 హార్స్పవర్లను అందించవచ్చు.
అయితే, ఇంజిన్ ఆప్షన్ విషయంలో కొంత కన్ఫ్యూషన్ ఉంది. 1.5-లీటర్ ఇంజన్ దాని తక్కువ ధర మరియు మెరుగైన మైలేజీ కారణంగా భారతీయ మార్కెట్‌కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, 2.5-లీటర్ ఇంజన్ కారును చాలా ఖరీదైనదిగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మొత్తంమీద, కొత్త కారు దాని బోల్డ్ డిజైన్, స్మార్ట్ ఫీచర్లు మరియు ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది. అయితే, అధికారిక లాంచ్ కోసం వేచి ఉండటం మరియు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి మరిన్ని వివరాల కోసం వేచి ఉండటం మంచిది.
Ford EcoSport 2024 Specifications
Category |
Specifications |
---|---|
Design |
|
Interior |
|
Engines |
|
Market Positioning |
|
Conclusion |
|
Ford EcoSport 2024