Valuable TS TET Last Date 2024 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ విద్య శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. మర్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు తేదీ కూడా మరో మూడు రోజుల్లో ముగుస్తుంది. మరి ఇంతకీ, టెట్ పరీక్షకు మీరు దరఖాస్తు చేసుకున్నారా? ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే అర్హత వివరాలు, అప్లికేషన్ ఫీజు మరియు టెట్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం గురించి మేము పూర్తిగా వివరించాము. అదేంటో ఒకసారి చూద్దాం.
టీఎస్ టెట్ యొక్క ముఖ్య సమాచారం
వివరణ | వివరాలు |
బోర్డు పేరు | తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ |
పరీక్ష పేరు | టీఎస్ టెట్ 2024 |
పోస్టులు | ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 27, 2024 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 10, 2024 |
పరీక్ష తేదీ | మే 20 నుండి జూన్ 3 వరకు |
దరఖాస్తు రుసుము | ఒక్క పేపర్ కి రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 |
టీఎస్ టెట్ అధికారిక వెబ్సైటు | https://tstet2024.aptonline.in/tstet/ |
ఈ సారి టెట్ పరీక్షకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి..?
గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు పెద్దగా రాలేదు. పోయిన టెట్ పరీక్షకు దాదాపు 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా పేపర్-1కి 82,560, పేపర్-2కి 21,501 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు పేపర్లకు మొత్తం 1,86,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో టెట్‌కు మొత్తం 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈసారి నిర్వహించే టెట్‌కు ఆ స్థాయిలో దరఖాస్తులు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా, విడుదల చేసిన ప్రకటనకు సంబంధించి సుమారు లక్ష దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి దరఖాస్తులు ఎక్కువ వచ్చినప్పటికీ గతంతో పోలిస్తే తక్కువే అని చెప్పవచ్చు.
టెట్ పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- టెట్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా, ‘Fee Payment’ఆప్షన్ ను ఎంచుకుని,రుసుమును చెల్లించండి.
- పేమెంట్ స్టేటస్ కాలమ్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయిందా లేదా చెక్ చేయాలి.
- ఆ తర్వాత, ‘application submission’ ఎంపికపై క్లిక్ చేయండి.
- మీ వివరాలు నమోదు చేయాలి. ఫొటో, సైన్ తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
- మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీరు ‘ప్రింట్ అప్లికేషన్’ ఆప్షన్ ను ఎంచుకొని మీ అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ లేదా ప్రింట్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ నంబర్‌ను జాగ్రత్తగా పెట్టుకోండి. హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
టీఎస్ టెట్ పరీక్ష పాటర్న్ (పేపర్ – 1) – 2024
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
మ్యాథమెటిక్స్ | 30 | 30 |
చైల్డ్ డెవలప్మెంట్ మరియు టీచింగ్ | 30 | 30 |
ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, ఉర్దూ, కన్నడ, బెంగాలీ, తమిళం, గుజరాతీ మరియు మరాఠీ) | 30 | 30 |
సెకండ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) | 30 | 30 |
ఎన్విరాన్మెంటల్ స్టడీస్ | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
టీఎస్ టెట్ పరీక్ష పాటర్న్ (పేపర్ – 2) – 2024
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
మ్యాథమెటిక్స్/సోషల్/ సైన్స్ | 60 | 60 |
చైల్డ్ డెవలప్మెంట్ మరియు టీచింగ్ | 30 | 30 |
ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, ఉర్దూ, కన్నడ, బెంగాలీ, తమిళం, గుజరాతీ మరియు మరాఠీ) | 30 | 30 |
సెకండ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) | 30 | 30 |
మొత్తం | 150 | 150 |