Amazing Lectrix electric scooter : హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ.50 వేల ధరలో.

Lectrix electric scooter

Lectrix electric scooter : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ఎస్​ఏజీ గ్రూప్​నకు చెందిన లెక్ట్రిక్స్​ ఈవీ సంస్థ నుంచి తాజాగా కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని విడుదల చేసింది. దీని ఎక్స్​షోరూం ధర కేవలం రూ. 49,999 మాత్రమే. అంతేకాకుండా.. సర్వీస్​లో భాగంగా లెక్ట్రిక్స్​ సంస్థ నుంచి ఈ-స్కూటర్​కి బ్యాటరీని కూడా అందిస్తోంది. అంటే, కస్టమర్లు బ్యాటరీ సర్వీస్​ కి సబ్​స్క్రిప్షన్​ బేసిస్​ కింద డబ్బులు కట్టవలసి ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- లెక్ట్రిక్స్​ ఈవీ ముఖ్యమైన అంశాలు:

” లెక్ట్రిక్స్​ ఈవీ బిజినెస్​ ప్రెసిడెంట్​ ప్రతీశ్​ తల్వార్​ తెలిపిన ప్రకారం ఈ బ్యాటరీ సర్వీస్​ కాన్సెప్ట్​ చాలా సింపుల్ గాను..సమర్ధవంతంగా ఉంటుంది బ్యాటరీని వెహికిల్​ నుంచి లింక్​ ను తొలగించి, సర్వీస్​ ప్రొవైడ్​ చేస్తాము. దీని వలన వినియోగదారుల యొక్క సౌలభ్యాన్ని, భరించగలిగే శక్తి మరియు అనుభవం మెరుగుపడుతుంది. బ్యాటరీ వ్యవహారంలో సందేహాస్పదమైనది దాని యొక్క అధిక ధర ఈవీ అడాప్షన్​కు సవాలుగా మారింది. ఈ బ్యాటరీ సర్వీస్​తో, ఆ రెండు సవాళ్లను అధిగమించాము.

“ICE ఇంజిన్​ స్కూటర్​ ని కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 1 లక్ష ఖర్చు పెట్టాలి. కానీ సగం ధరకే అంటే రూ. 49,999కే ఎలక్ట్రిక్​ స్కూటర్​ ని మేము మార్కెట్ లోకి తీసుకువచ్చాము. మరోవైపు పెట్రోల్​ బిల్లులపై ప్రతి నెలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మా సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​తో ఎలక్ట్రిక్​ స్కూటర్ ని కొనుగోలు చేస్తే ఆర్ధికంగా కూడా వెసులుబాటుగా కూడా ఉంటుంది,” అని తల్వార్​ పేర్కొన్నారు.

భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల :
ఇతర మోడల్స్​తో కంపేర్ చేస్తే బ్యాటరీ-ఆన్-ఏ సర్వీస్​ (BASS) ప్రోగ్రామ్​ ద్వారా విక్రయిస్తున్న తమ లెక్ట్రిక్స్​ ఈవీ తాజా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర 40శాతం తక్కువని సంస్థ చెబుతోంది. ఈ Ev ని ఒక్క ఛార్జ్ తో 100కి.మీల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ గరిష్ట వేగం 50 Kmph. ఇంకో విశేషం ఏమిటంటే లైఫ్​ టైమ్​ బ్యాటరీ వారెంటీ కూడా అందిస్తోంది.

2024 ఫిబ్రవరిలో, LXS 2.0 పేరుతో ఇదే సంస్థ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని విడుదల చేసింది. ఇది 98 కిలోమీటర్ల రేంజ్​ కలిగి ఉంది. 2.0 లో 2.3 Kwh బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని ఎక్స్​షోరూం ధర వచ్చేసి రూ. 79,999 గా ఉంది. సంస్థ పేర్కొన్న ప్రకారం ఇది చాలా యునీక్ స్కూటర్. రేంజ్​, క్వాలిటీ, వాల్యూకి ప్రిఫరెన్స్​ ఇచ్చే వినియోగదారులకు ఈ స్కూటర్​ చాలా ఉత్తమమైన ఎంపిక అని కంపెనీ చెబుతోంది.

Lectrix EV LXS G 2.0 : ఈ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ఎలక్ట్రిక్​ స్కూటర్​ మీద 3సంవత్సరాలు లేదా 30వేల కి.మీల వారెంటీ ఇస్తోంది కంపెనీ. LXS G 2.0 లో యాంటీ థెఫ్ట్​ సిస్టెమ్​, ఎమర్జెన్సీ SOS వంటి ఫీచర్స్​ ఉన్నాయి. డోర్​స్టెప్​ సర్వీస్​ని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది సంస్థ.

Lectrix electric scooter

 

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in