Telugu Mirror: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. సుదీర్ఘ కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తూ వస్తున్న కోరికను ప్రభుత్వం నెరవేర్చింది.46, 000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ని ప్రభుత్వం లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం ముఖ్యమంత్రి కేసిఆర్(KCR) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సుదీర్ఘంగా సాగిన సమావేశం లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తరువాత 46, 746 మంది TSRTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. ప్రభుత్వం లోని ఇతర శాఖల లోని ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల ప్రయోజనాలను వారు పొందుతారు. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి KTR మంత్రివర్గం ఆమోదం తెలిపిన వివరాలను ప్రకటించారు.
Also Read:Vande Bharat: రైల్వేశాఖ నిర్లక్ష్యం- రోటీలలో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!
1932లో పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో నిజాం స్టేట్ రైల్వే (Nizam State Railway)విభాగం అయిన NSR -RTD (నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్) గా మొట్టమొదట 27 బస్సులతోటి 166 మంది ఉద్యోగులతో RTC స్థాపించబడింది.
అనంతరం రోడ్డు రవాణా సంస్థల చట్టం 1950 ప్రకారం జనవరి 11, 1958న ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ (APSRTC) కార్పోరేషన్ స్థాపించబడింది.
Also Read: Telangana : తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు మంజూరు.. !
ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో RTC రెండు వేర్వేరు కార్యనిర్వహక కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని 2015 జూన్ 3 న కార్య కలాపాలను ప్రారంభించినాయి.
విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం రోడ్ రవాణా సంస్థ చట్టం 1950 ని అనుసరించి 27 ఏప్రిల్, 2016 న TSRTC ని ఏర్పాటు చేసింది. TSRTC ఏప్రిల్ 2022 నాటికి 9,384 బస్సులను కలిగి ఉండి , 46,746 మంది ఉద్యోగులను కలిగి ఉంది. రాష్ట్రంలో ఆర్ టి సి సంస్థ 364 బస్ స్టేషన్ లు కలిగి ఉండి,10 వేల లోపు బస్సులతో 11 రీజియన్ ల పరిధిలోని 98 బస్ డిపోలతో ప్రజా రవాణా ను నిర్వహిస్తుంది.