Realme P1 5G and P1 Pro 5G: రూ. 20,000 లోపు ధరలో ఏప్రిల్ 15న Realme నుంచి Pసిరీస్ 5G ఫోన్ లు విడుదల.

Realme P1 5G and P1 Pro 5G: Rs. 20,000 under
Image Credit : Telugu Mirror

Realme P1 5G and P1 Pro 5G : Realme తన కొత్త P సిరీస్‌ను వచ్చే వారం ప్రారంభం చేస్తున్నట్లు రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ప్రారంభం కానున్న సిరీస్‌లో రెండు ఫోన్‌లు ఉంటాయి. అవి Realme P1 5G మరియు Realme P1 Pro 5G. Realme విడుదల చేయనున్న P సిరీస్ స్మార్ట్ ఫోన్ లు MediaTek డైమెన్సిటీ 7050 మరియు Qualcomm Snapdragon 6 Gen 1 SoCల అమరికతో రానున్నాయని నిర్ధారించబడింది. P సిరీస్ ఫోన్‌ల ధరలు మరియు మరికొన్ని వివరాలను కూడా Realme కంపెనీ వెల్లడించింది.

ఇండియాలో Realme P1, P1 Pro విడుదల తేదీ, ధర:

భారతదేశంలో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Realme నుంచి తాజాగా రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, Realme P1 Pro 5G మరియు Realme P1 5Gలను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లు ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.

రానున్న Realme P1 5G ధర రూ. 15,000 కంటే తక్కువగా లభిస్తుందని ధృవీకరించబడింది, అయితే Realme P1 Pro 5G భారతీయ కస్టమర్ లకు రూ . 20,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.

రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు తెలిపిన వివరాల ప్రకారం Realme P-సిరీస్ యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను మంచి విలువలతో అందించిందని చెప్పారు. అదనంగా, 2023 నాటికి భారతదేశంలో 2023 వరకు Realme 100 మిలియన్లకు పైగా ఫోన్ లను విక్రయించిందని జు తెలిపారు.

Realme P1 5G and P1 Pro 5G: Rs. 20,000 under
Image Credit : Telugu Mirror

Realme వెల్లడించిన P1, P1 Pro ల ముఖ్యమైన స్పెసిఫికేషన్ లు.

Realme P సిరీస్ ఫోన్‌లు 2,000 nits గరిష్ట బ్రైట్నెస్ తో 120Hz AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లు సుదీర్ఘ కాలంలో ఫోన్ ఎక్కువగా చూస్తే కలిగే కంటి ఒత్తిడిని తగ్గించడానికి TUV రైన్‌ల్యాండ్ కంటి రక్షణ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటాయి.

Realme P1 5G, MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది, అయితే Realme P1 Pro 5G మాత్రం Qualcomm Snapdragon 6 Gen 1 SoC చిప్ సెట్ తో వస్తుంది. మరో అదనపు అంశంగా Realme ఈ పరికరాలు తీవ్రమైన టాస్క్‌ల సమయంలో వేడెక్కకుండా నిరోధించడానికి VC చల్లబరచే వ్యవస్థను కలిగి ఉన్నాయి.

Realme P1 5G మరియు P1 Pro 5G 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ పరికరాలు అప్ డేట్ చేయబడిన టచ్‌స్క్రీన్ రియాక్షన్ కోసం రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్ మరియు రక రకాల పరిస్థితులలో మన్నిక కోసం నీరు మరియు ధూళి నిరోధకత కోసం IP65 రేటింగ్‌ను కూడా కలిగి ఉన్నాయి.

Realme P1 5G మరియు P1 Pro 5G గురించి ఇంకా ఇతర వివరాలు ఏవీ వెల్లడించలేదు. అయితే విడుదల సమీపిస్తున్న కొద్దీ రాబోయే రోజుల్లో కొత్త ఫోన్‌ల గురించి Realme అదనపు సమాచారాన్ని వెల్లడిస్తుంది.

Realme P1 5G and P1 Pro 5G

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in