Vivo T3x 5G: ఏప్రిల్ 17న భారత్ లో లాంఛ్ అవుతున్న Vivo T3x 5G బడ్జెట్ ఫోన్. ధర,ఇతర అంచనా వివరాలు ఇక్కడ..

Vivo T3x 5G: April 17 in India
Image Credit : Telugu Mirror

Vivo T3x 5G: అనేక టీజర్లు మరియు లీక్‌ల తర్వాత Vivo T3x 5G స్మార్ట్ ఫోన్ భారత దేశంలో లాంఛ్ తేదీ వెల్లడైంది. Vivo T3 ఈ ఫోన్‌ బేస్ మోడల్. Vivo T3 భారతదేశంలో ఏప్రిల్ 17న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల అవుతుంది. Vivo నుండి అధికారికంగా రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ లో ఫోన్ యొక్క రంగులు మరియు వెనుక భాగాన్ని చూపిస్తుంది. ఈ ఫోన్ అమ్మకానికి లభించే ప్లాట్‌ఫారమ్‌లు కూడా వెల్లడయ్యాయి. Vivo ఇండియా, Vivo T3x 5G లాంచ్ తేదీ వెల్లడించింది.

Vivo T3x 5Gని ఏప్రిల్ 17న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:00 గంటలకు భారత దేశంలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యమవుతుంది.

ఫోన్ గ్రీన్ మరియు మెరూన్ కలర్ వేరియంట్ లలో రానున్నట్లు తెలుస్తోంది.

Vivo T3x 5G Flipkart (ఒక మైక్రోసైట్), Vivo ఇండియా మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో విక్రయించబడుతుంది.

ఫోన్ డ్యూయల్ సెన్సార్లు మరియు LED ఫ్లాష్‌తో కూడిన పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను వెనుక వైపు ఎడమ ప్రక్కన కలిగి ఉంటుంది. ఫోన్ కు కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటుంది. ఇది ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌గా కూడా పనిచేస్తుంది.

ఫోన్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు ఆడియో బూస్టర్ నిర్ధారించబడ్డాయి.

ఫ్లిప్‌కార్ట్ మైక్రో సైట్ వెల్లడించిన ప్రకారం Vivo T3x 5G భారతదేశంలో రూ.15,000 లోపు ఉంటుంది. ఇది బడ్జెట్ రేంజ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ ఫోన్ యొక్క వివరాలను ఏప్రిల్ 12న కొన్ని మరియు ఏప్రిల్ 15న పూర్తిగా వెల్లడి చేస్తుంది Vivo ఇండియా.

Vivo T3x 5G స్పెక్స్ అంచనా

డిస్ ప్లే: Vivo T3x 5G కోసం 6.72-అంగుళాల FHD 120Hz డిస్ ప్లేతో వస్తుందని అంచనా.

ప్రాసెసర్: Qualcomm Snapdragon 6 Gen 1 SoC మరియు Adreno GPU ఫోన్‌కు శక్తిని ఇస్తాయని భావిస్తున్నారు.

స్టోరేజ్: ఫోన్‌లో 4GB, 6GB లేదా 8GB స్టోరేజ్ ఎంపికలతో పాటు 128GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో ఉండవచ్చని భావిస్తునారు.

కెమెరా: Vivo T3x 5Gలో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు.

బ్యాటరీ: 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ సాధ్యమవుతుంది.

అదనపు ఫీచర్లు: సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్, 8GB ఎక్స్‌పాండబుల్ ర్యామ్.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in