Sun Stroke: ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండకి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఎండల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె వ్యాధిగ్రస్తులు మరియు ఆరోగ్యవంతులు కూడా జాగ్రత్త వహించాలి.
వడదెబ్బ వల్ల గుండెపోటు వస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి అంతా వడగాలుల వీస్తూ ఉండడం వల్ల గుండె జబ్బులకు కారణమవుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వైద్యుల ప్రకారం, 2015 నుండి 2020 వరకు చైనాలో గుండెపోటు మరణాలకు ఎండా తీవ్రత ప్రధాన కారణం అని చెబుతున్నారు. పెద్దలే కాదు చిన్న వయసులో ఉన్నవాళ్లు కూడా మరణించారు.
వడదెబ్బకు, గుండెపోటుకు లింక్ ఏంటి?
వడదెబ్బ గుండెపోటుకు ఎలా దారితీస్తుందో మరియు దానితో ఎలా ముడిపడి ఉంటుందో తెలుసా? పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి, గుండె సాధారణం కంటే ఎక్కువగా పని చేయాలి. రక్త ప్రసరణ కావాలంటే, అనేక సమస్యలను తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం విషయంలో చెమటను బయటకు పంపేందుకు గుండె ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఎండాకాలం ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఫ్లూయిడ్స్ ని కోల్పోతాము. దానితో, రక్తం చిక్కబడి పంప్ చేయడం కష్టమవుతుంది. అందువల్ల గుండెపై ఒత్తిడిని పెంచుతుంది, ఇలా పెరిగిన పనిభారం గుండెపోటు కి దారి తీస్తుంది.
పెద్దలు జాగ్రత్తగా ఉండాలి.
70 ఏళ్లు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం మరియు ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారికి ఎక్కువ ప్రమాదం పెరుగుతుంది. ఎండలో పనిచేసేవారు, ఎండకి పనులు చేసేవారు కూడా తగిన రక్షణ తీసుకోవాలి. చెమట, వాంతులు, బలహీనత లేదా అలసట వంటి లక్షణాలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎండ దెబ్బతినకుండా జాగ్రత్తలు
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు.
- శరీరాన్ని ఎప్పుడు హైడ్రాటెడ్ గా ఉంచుకోవడం మంచిది. ఎక్కువగా జ్యుసులు తాగాలి. మీకు దాహం అనిపించకపోయినా, తగినంత నీరు త్రాగాలి. ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే లిక్విడ్స్ తీసుకుంటే మంచిది.
- ఎక్కువగా ఎండలో ఉండకండి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటికే పరిమితం అయ్యేలా చూసుకోండి.
- తేలికపాటి, లేత రంగు కాటన్ దుస్తులను ధరించండి.
Sun Stroke