Teja Sajja Next Movie : మంచు మనోజ్ విలన్ గా తేజ సజ్జ ఓ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర చేసి గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు, అతను మరెవరో కాదు, రీసెంట్ గా రవితేజతో ‘ఈగల్’ (Eagle) వంటి సూపర్ స్టైలిష్ ఫిలిం తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని.
తేజ సజ్జ తన నెక్స్ట్ మూవీ కార్తీక్ తో చేస్తున్నారు. సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కార్తీక్, ఇప్పుడు తేజ సజ్జతో ఇంకెలాంటి మూవీ తెరకెక్కించబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ (Hanuman) చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సాధించారు. పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ ఏకంగా రూ.300కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సెన్సేషనల్ హిట్ అయింది.
ఈ మూవీకి సీక్వెల్‍గా జైహనుమాన్ కూడా రూపొందనుంది. అయితే, తేజ సజ్జా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈగల్ మూవీ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది. కాగా ఈ టైటిల్ గ్లింప్స్ (Glimpse) అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ 18న ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు.
Glad to be joining forces with the SuperHero @TejaSajja123 for our prestigious #PMF36 ❤️🔥
An adventurous saga of #SuperYodha 🥷
Directed by @Karthik_gatta 💥
Produced by @vishwaprasadtg ✨Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 😎
Stay tuned 🔥 pic.twitter.com/h3VjtaslHW
— People Media Factory (@peoplemediafcy) April 15, 2024
ఏప్రిల్ 15 న విడుదల చేసిన పోస్టర్ లో సూపర్ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ తో వెనక్కు తిరిగి నిల్చున్నాడు. హనుమాన్ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ ,ఇక్కడ మాత్రం స్టైలిష్ మేకోవర్ తో సూపర్ యోధాగా అద్భుతంగా కనిపించాడు. ఈ సినిమా టైటిల్ ని ఏప్రిల్ 18న ప్రకటించనున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి 36వ ప్రాజక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు గ్లింప్స్ ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. గౌర హరి సంగీతం అందించనున్న ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించనుండగా మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.