UPSC Civils Final Result 2023: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో తెలుగమ్మాయికి మూడో ర్యాంక్, సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు వీరే.

UPSC Civils Final Result 2023

UPSC Civils Final Result 2023: దేశవ్యాప్తంగా అఖిల భారత సర్వీసులలో ఉద్యోగ నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు తమ సత్తా చాటారు.
తెలంగాణా లోని మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది.

UPSC Civils Final Result 2023

టాప్ 10 ర్యాంకర్ లు

తొలి ర్యాంక్ తో ఆదిత్య శ్రీ వాస్తవ తన ప్రతిభను చాటగా.. అనిమేష్ ప్రధాన్ (2), దోనూరు అనన్య రెడ్డి (3), పి కె సిద్దార్ద్ రామ్ కుమార్ (4), రుహానీ (5), సృష్టి దభాన్ (6), అన్ మోల్ రాఠోర్ (7), ఆశీష్ కుమార్ (8), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంక్ లతో తమ ప్రతిభను చాటారు. గత సంవత్సరం విడుదలైన సివిల్స్ -22 పరీక్షా ఫలితాలలో తెలుగు అమ్మాయి ఉమా హారతి 3వ ర్యాంక్ తో మెరవగా. మంగళవారం విడుదలైన సివిల్స్-23 ఫలితాలలో తెలంగాణాకు చెందిన దోనూరు అనన్యా రెడ్డి కూడా 3వ ర్యాంక్ సాధించడం విశేషం.

సివిల్ సర్వీసెస్ ఫలితాలు-2023లో మెరుపులు మెరిపించిన తెలుగు తేజాలు

జాతీయ స్థాయి 3వ ర్యాంక్ తో అనన్యా రెడ్డి మెరవగా, నందల సాయి కిరణ్ (27), మెరుగు కౌశిక్ (82), పెంకీసు ధీరజ్ రెడ్డి (173), జీ. అక్షయ్ దీపక్ (196), గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ (198), నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి (382), బన్న వెంకటేష్ (467), కడుమూరి హరి ప్రసాద్ (475), పూల ధనుష్ (480), కె. శ్రీనివాసులు (526), నెల్లూరు సాయితేజ (558), కిరణ్ సాయింపు (568), మర్రి పాటి నాగ భరత్ (580), పోతుపు రెడ్డి భార్గవ్ (590), కె. అర్పిత (639), ఐశ్వర్య నెల్లిశ్యామల (649), సాక్షి కుమారి (679), చౌహాన్ రాజ్ కుమార్ (703), గాదె శ్వేత (711), వి. ధనుంజయ్ కుమార్ (810), లక్ష్మీ బానోతు (828), ఆదా సందీప్ కుమార్ (830), జె. రాహుల్ (873), హనిత వేములపాటి (887), కె. శశికాంత్ (891), కెసారపు మీన (899), రావూరి సాయి అలేఖ్య (938), గోవద నవ్య శ్రీ (995) ర్యాంక్ లతో మెరిసి, తమ సత్తా చాటారు.

కేంద్ర ప్రభుత్వంలోని ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ వంటి వివిధ శాఖలలో 1105 పోస్ట్ ల భర్తీకి 2023 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. గత సంవత్సరం మే 28న ప్రిలిమ్స్ నిర్వహించి ప్రిలిమ్స్ పరీక్ష క్లియర్ చేసిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తారీఖుల్లో మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలను విడుదల చేసినారు. మెయిన్స్ లో క్వాలిఫై అయిన వారికి ఈ ఏడాది జనవరి 2 మరియు ఏప్రిల్ 9 మధ్య వివిధ దశలలో వ్యక్తిగత ఇంటర్వ్యూ లను నిర్వహించి ఏప్రిల్ 16 2024 న తుది ఫలితాలను విడుదల చేశారు.

యూపీఎస్సీ (UPSC) ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు-2023 లో 1016 మందిని ఎంపిక చేయగా జనరల్ కేటగిరీ నుంచి 347 మంది, EWS నుంచి 115 మంది, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ నుంచి 86 మంది చొప్పున ఎంపికయ్యారు.

UPSC Civils Final Result 2023

Also Read:UPSC Results 2024, valuable Information : యూపీఎస్సీ సివిల్స్‌ ఫైనల్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్‌ ఇదే.

 

 

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in