Singareni Recruitment : తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SSCL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. జూన్ 4 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను లో చెక్ చేసుకోవచ్చు.
ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారంvఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీ (ఈఅండ్ఎం, సిస్టమ్స్)-49 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 4న సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సింగరేణి యాజమాన్యం సూచించింది.
పోస్ట్ ల వివరాలు :
1. ఎగ్జిక్యూటివ్ కేడర్ – 49.
మేనేజ్మెంట్ ట్రైనీ (E&M), E2 గ్రేడ్ : 42 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), E2 గ్రేడ్ : 7 పోస్టులు
2. నాన్ ఎగ్జిక్యూటివ్ (NCWA) కేడర్ – 278
జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (JMET), T&S గ్రేడ్-C : 100 స్థానాలు
అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ (మెకానికల్), T&S గ్రేడ్-సి : 9 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), T&S గ్రేడ్-సి : 24 పోస్టులు.
ఫిట్టర్ ట్రైనీ, క్యాట్-I : 47 పోస్టులు
ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్-I : 98 పోస్టులు
అర్హత : తగిన విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి : 30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల అభ్యర్థులు ఐదేళ్ల సడలింపుకు అర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలి: మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : మే 15, 2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 4, 2024.