PM Surya Ghar Yojana: కేంద్ర ప్రభుత్వ నూతన రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ “పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన” కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకుని సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ప్రతి నెలా 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చు. 300 యూనిట్లకు మించి మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఫిబ్రవరి 13, 2024న రూ. 75,021 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైంది. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేయడంతోపాటు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ (SBI) ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన కింద లోన్ ఇచ్చేందుకు ప్రకటన చేసింది. ఈ ప్లాన్ సోలార్ పవర్ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేసే వారికి ఫైనాన్సింగ్ అందిస్తుంది.
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించిన వివరాలు:
సబ్సిడీ : ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్ (kW) సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి రూ.30,000 సబ్సిడీని అందిస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీని అందిస్తుంది.
గరిష్ట రుణం: స్టేట్ బ్యాంక్ 3 kW ల ఏర్పాటు కోసం గరిష్టంగా రూ. 2 లక్షలు, 10 kW లకు గరిష్టంగా రూ. 6 లక్షలు అందజేయనున్నారు.
కొలేటరల్ ఫ్రీ లోన్ : రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ (RTS) సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి అర్హత ఉన్న దరఖాస్తుదారులు 7% కొలేటరల్-ఫ్రీ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రుణ నిబంధనలు: లోన్ వ్యవధి 120 నెలల వరకు ఉంటుంది. రుణం తీసుకున్నప్పడి నుండి ఆరు నెలల మారటోరియం ఉంది. అంటే, లోన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత వెంటనే లోన్ EMI ప్రారంభమవుతుంది.
ముఖ్య వివరాలు
- SBI లోన్‌కు అర్హత పొందాలంటే, దరఖాస్తుదారు వయస్సు 65 ఏళ్లలోపు ఉండాలి.
- CIBIL స్కోర్ 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
- పైకప్పుపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన స్థలం ఉండాలి.
- పైకప్పు ప్రాంతం తప్పనిసరిగా నిర్దిష్ఠ అవసరాలను కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా పొదుపు ఖాతాను కలిగి ఉండాలి.
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డ్
- నివాస ధృవీకరణ పత్రం
- విద్యుత్ బిల్లు,
- బ్యాంక్ పాస్‌బుక్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- రేషన్ కార్డు
- మొబైల్ నంబర్ అఫిడవిట్
- ఆదాయ ధృవీకరణ పత్రం
రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజనపై ఆసక్తి ఉన్నవారు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా SBI లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే, మీ సమీప బ్యాంక్ లొకేషన్‌లో దరఖాస్తు చేసుకోండి.
PM Surya Ghar Yojana