home loan bank wise: హోమ్ లోన్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవే, బ్యాంకుల వారీగా వడ్డీ రేట్లు

home loan bank wise
image Credit : loankorner.com

home loan bank wise: ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇల్లు నిర్మించాలనే కలని సాకారం చేసుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయతినిస్తుంటారు. మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువగా ఇంటి లోన్ల (house loans) పై ఎక్కువ ఆధారపడి ఉంటారు. బ్యాంకులను బట్టి హోమ్ లోన్ల వడ్డీ రేట్లలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే, వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులలో మారుతున్న వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు

హౌస్ ఫైనాన్సింగ్ వడ్డీ రేట్లు బజాజ్ ఫైనాన్సింగ్ కంపెనీ (Bajaj Finance Company) లో 8.50 శాతం, టాటా క్యాపిటల్‌ (Tata Capital) లో 8.75 శాతం, GIC హౌస్ ఫైనాన్స్‌లో 8.80 శాతం, SMFG ఇండియా హోమ్ ఫైనాన్స్‌లో 10 శాతం, ఇండియా బుల్స్ హౌసింగ్‌ (India Bulls Housing) లో 8.75 శాతం, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో 8.60 శాతం, ఐసిఐసిఐ హోమ్‌లో 9.20 శాతం మరియు గోద్రెజ్ వద్ద 8.55 శాతం నుండి రేట్లు ప్రారంభమవుతాయి.

PNB హౌసింగ్ ఫైనాన్స్ 8.50 మరియు 14.50 వరకు వడ్డీ రేట్లు విధిస్తున్నారు.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో రూ.30 లక్షలకు 8.35 నుంచి 10.35 శాతం, రూ.75 లక్షలకు 8.35 నుంచి 10.55 శాతం, రూ.75 లక్షలకు పైగా 8.35 నుంచి 10.75శాతం వడ్డీ రేట్లు విధించారు.

home loan bank wise
Image Credit : Magic Bricks

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..

గృహ రుణాలపై, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50 శాతం నుండి 9.85 శాతం వరకు వడ్డీ రేట్లు వసూలు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 30 లక్షల వరకు ఇచ్చే రుణాలపై 8.40 శాతం నుండి 10.65% వడ్డీని, రూ. 75 లక్షల రుణాలపై 8.40 నుండి 10.65% మరియు అంతకంటే ఎక్కువ ఇచ్చే లోన్ పై 8.40 నుండి 10.90% వరకు వడ్డీ వసూలు చేస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.30 లక్షల లోపు రుణాలపై 8.35 నుంచి 10.75 శాతం ఉండగా, రూ.75 లక్షల లోపు రుణాలపై 8.35 నుంచి 10.90 శాతం, ఆపై ఎక్కువ లోన్ పై 8.35 నుంచి 10.90 శాతం వరకు వడ్డీ రేట్లను విధించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 30 లక్షల కంటే తక్కువ రుణంపై 8.45 నుండి 10.25 శాతం వడ్డీ రేట్లు వసూలు చేయగా.. రూ. 75 లక్షల లోన్ పై 8.40 నుండి 10.15 శాతం వరకు, మరియు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 8.40 నుండి 10.15 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే గృహ రుణాలపై వడ్డీ రేటు 8.40 నుండి 10.85% వరకు ఉంటుంది.

కెనరాబ్యాంక్ రూ. 30 లక్షల కంటే తక్కువ రుణంపై 8.50 నుండి 11.25 శాతం వసూలు చేయగా.. రూ. 75 లక్షల లోన్ పై 8.45 నుండి 11.25 శాతం, రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 8.40 నుండి 11.15 శాతం వరకు ఉంటాయి.

UCO బ్యాంక్ వద్ద 8.45 నుండి 10.30 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.35 నుండి 11.15 శాతం, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్‌లో 8.50 నుండి 10%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 8.40 నుండి 10.60 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 8.45 నుండి 9.80 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు.

sbi-offers-up-to-65-bps-concession-on-home-loan-interest-rate
Image Credit : News 18

ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..

కోటక్ మహీంద్రా బ్యాంక్ వద్ద వడ్డీ రేట్లు 8.70 శాతం వద్ద ప్రారంభమవుతాయి, ఐసిఐసిఐ బ్యాంక్ 8.75 శాతం, హెచ్‌ఎస్‌బిసి 8.45 శాతం, ఫెడరల్ బ్యాంక్ 8.80 శాతం, ఆర్‌బిఎల్ 8.90 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 9.40 శాతం వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి.

కరూర్ వైశ్యా బ్యాంక్ 9 నుండి 11.05 శాతం, కర్ణాటక బ్యాంక్ 8.50 నుండి 10.62 శాతం, ధనలక్ష్మి బ్యాంక్ 9.35 నుండి 10.50 శాతం, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 8.60 నుండి 9.95శాతం, సీఎస్‌బీ 10.73 నుండి 12.58 శాతం వడ్డీ రేట్లు విధించాయి.

సౌత్ ఇండియన్ బ్యాంక్ రూ.30 లక్షల రుణాలకు 9.84 నుంచి 11.24 శాతం, రూ.75 లక్షల లోపు రుణాలకు 9.84 నుంచి 11.04 శాతం, రూ.75 లక్షల కంటే ఎక్కువ ఇచ్చే రుణాలకు 9.84 నుంచి 11.69 వరకు వసూలు చేస్తోంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in