TS SSC Supplementary Exams : తెలంగాణలో (Telangana) 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతోగానో ఎదురుచూశారు. నిన్న తెలంగాణా విద్యా శాఖ పదవ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయినా విద్యార్థులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Advanced Supplementary Examinations) జరుగుతాయని విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు.
తెలంగాణ 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం (ఏప్రిల్ 30) ఉదయం విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,94,207 మంది సాధారణ విద్యార్థులు, 11,606 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 4,51,272 (91.31%) మంది ఉత్తీర్ణులయ్యారు.
సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary exams) జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరగనున్నాయి.. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు గడువు సమీపిస్తున్నందున, మార్చి 2024లో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రీ కౌంటింగ్ (Re counting) లేదా రీ వెరిఫికేషన్‌తో సంబంధం లేకుండా జూన్‌లో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోమని తెలిపారు.
ఫీజు చెల్లింపుల గడువు మే 16తో ముగుస్తుంది. అలాగే, ఫలితాలు ప్రకటించిన 15 రోజుల వరకు రీ-కౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ జరుగుతుంది. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించగా .. రీవెరిఫికేషన్ కోసం 1000 చెల్లించాలి.
రీ కౌంటింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి…
తెలంగాణ 10వ తరగతి పరీక్షలను తిరిగి లెక్కించేందుకు, విద్యార్థులు ఫలితాలు ప్రకటించిన 15 రోజులలోపు ప్రతి సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి, మే 15వ తేదీన SBI బ్యాంక్‌లో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా చలానా సమర్పించాలి. 0202 ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ కల్చర్, 1జనరల్ ఎడ్యుకేషన్, 102 సెకండరీ ఎడ్యుకేషన్, 6 ప్రభుత్వ బోర్డు ఎగ్జామ్ డైరెక్టర్, మరియు 800 యూజర్ ఛార్జీల హెడ్ అకౌంట్లకు ఫీజు చెల్లించాలి.
తెలంగాణలో 3927 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో 17 ఎయిడెడ్ పాఠశాలలు, 81 ఆశ్రమ పాఠశాలలు, 142 బీసీ సంక్షేమ పాఠశాలలు, 37 ప్రభుత్వ పాఠశాలలు, 177 కేజీబీవీ పాఠశాలలు, 60 మోడల్ పాఠశాలలు, 1814 ప్రైవేట్ పాఠశాలలు, 24 తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు, 77 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 112 సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి.
ఫెయిల్ అయిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా జూన్ లో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి. దీని కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఫీజు చెల్లించాలి.