IRCTC Thailand Tour : విశాఖపట్నం వాసులకు శుభవార్త, వైజాగ్ నుండి నేరుగా థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే వ్యక్తుల కోసం IRCTC కొత్త వెకేషన్ ప్యాకేజీని (Vacation package) ప్రవేశపెట్టింది. IRCTC ఇప్పటికే పర్యాటకుల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెట్టినప్పటికీ, ఈ ప్యాకేజీ చాలా సరసమైనది. IRCTC రైలు మరియు విమాన టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. అయితే, ప్రయాణికులు థాయ్‌లాండ్‌లోని అనేక ప్రదేశాలను సందర్శించేందుకు విమాన టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ప్యాకేజీని సెప్టెంబరు 7, 2024 నుండి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇందుకు సంంబధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.
వైజాగ్ టు థాయ్లాండ్ (Vizag to Thailand) టూర్ ప్యాకేజీ సమాచారం ఈ విధంగా ఉంది. IRCTC ప్రయాణికుల కోసం వైజాగ్ టు థాయిలాండ్ ట్రిప్ ప్యాకేజీని ప్రకటించింది. IRCTC ఈ టూర్ ప్యాకేజీని “మ్యాజికల్ థాయిలాండ్ ఎక్స్ విశాఖపట్నం” పేరుతో నిర్వహిస్తోంది. ఈ ప్యాకేజీలో ఐదు రాత్రులు మరియు ఆరు పగళ్లు ఉంటాయి. వైజాగ్ నుండి బయలుదేరే ప్రయాణికులకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ కొత్త టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 7, 2024 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ మొదటి రోజు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం మొదలవుతుంది.
ముందుగా బ్యాకాంక్ కు (Flight No. FD-117) చేరుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు పట్టాయాకు వెళ్తారు. భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం Nong Nooch Garden పర్యటన ఉంటుంది. ఆ రోజు రాత్రంతా పట్టాయాలోనే గడుపుతారు. ఇక, మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ ముగించుకున్న తర్వాత Coral Island Tourకు బయలుదేరుతారు. ఈ ప్రాంతానికి స్పీడ్ బోట్ ద్వారా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుండి తిరిగి పట్టాయాకు వస్తారు. నాలుగవ రోజు సఫారీ పర్యటన ఉంటుంది. అనంతరం అక్కడి నుండి బ్యాంకాక్ కు (Bangkok) చేరుకుంటారు. అక్కడి ప్రసిద్ధిచెందిన పలు ప్రాంతాలను సందర్శిస్తారు.
ఐదవ రోజు, బ్రేక్ ఫాస్ట్ తర్వాత, సగం రోజుల సిటీ టూర్ జరుగుతుంది. ఈ విహారయాత్రలో భాగంగా గోల్డెన్ బుద్ధుని వీక్షిస్తారు. ఆ తర్వాత దగ్గరలోని ఇండియన్ రెస్టారెంట్‌లో లంచ్ ఇస్తారు. తర్వాత, శ్రీ రాచా టైగర్ జూకి వెళ్లండి. ఆరవ రోజు ఉదయం గ్రాండ్ ప్యాలెస్ సందర్శిస్తారు. భోజనం తర్వాత, సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి తిరిగి వెళ్లండి. దాదాపు 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ధర వివరాలు.
టికెట్ ధరలు వివరాలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 66735 మరియు డబుల్ ఆక్యుపెన్సీకి, రూ. 57815 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 57815 గా ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో టిక్కెట్లు, హోటల్ వసతి, అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం ఉంటాయి. మరింత సమాచారం కోసం మరియు బుక్ చేసుకోవడానికి, దయచేసి https://www.irctctourism.com/ని సందర్శించండి.