Shirdi Tour: IRCTC హైదరాబాద్ నుండి షిర్డీ (Shirdi) కి ‘సాయి శివం’ పేరుతో టూరిజం ప్యాకేజీ (Tourism Package) ని ప్రకటించింది. ఈ ప్యాకేజీ తో మీరు నాసిక్ (Nasik) మరియు షిర్డీ (Shirdi) ని సందర్శించవచ్చు. హైదరాబాద్‌లో ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్యాకేజీ (Package) లో మూడు రాత్రులు మరియు నాలుగు పగళ్లు ఉంటాయి. ఈ ప్యాకేజీ ప్రస్తుతం మే 17, 2024న అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీని శుక్రవారాల్లో ఆపరేట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ తేదీని మిస్ అయితే మరొక తేదీకి వెళ్లవచ్చు.
1వ రోజు షెడ్యూల్ (1 Day Schedule) : ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న వారు 06:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ (Kachiguda Railway Station) నుండి రైలు ఎక్కుతారు. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ (Ajantha Express) లో ఎక్కాలి. రాత్రంతా మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
2వ రోజు షెడ్యూల్ (2nd Day Schedule): ఉదయం 7:10 గంటలకు నాగర్సూల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు, అక్కడ IRCTC వాళ్ళు పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్ (Hotel) లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
3వ రోజు షెడ్యూల్ (3rd Day Schedule): షిర్డీ హోటల్ నుండి ఉదయం చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత త్రయంబకేశ్వరుడు, పంచవటి దర్శనం లభిస్తుంది. అక్కడ నుండి నాగర్సోల్ స్టేషన్లో రాత్రి 8:30 గంటలకు రైలు ఉంది. ఆ ట్రైన్ 09:20 గంటలు బయలుదేరుతుంది. రాత్రిపూట అంత రైలు లోనే మీ యాత్ర ఉంటుంది.
Also Read: IRCTC Thailand Tour : విశాఖనగరవాసులకు గుడ్‌న్యూస్.. IRCTC స్పెషల్ థాయ్‌ల్యాండ్ టూర్.
4వ రోజు షెడ్యూల్ (4th Day Schedule): ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ (Kachiguda Railway Station) కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. హైదరాబాద్ నుండి బయలుదేరే ఈ షిర్డీ వెకేషన్ ప్యాకేజీకి టిక్కెట్ ధరలు రూ. సింగిల్ షేరింగ్ కోసం 9320 మరియు రూ. డబుల్ షేరింగ్ కోసం 7960 గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫర్ట్ క్లాస్‌లో అందుబాటులో ఉన్నాయి. మార్చి నెలతో పోల్చితే స్వల్పంగా టూర్ ప్యాకేజీ (Tour Package)ధర తగ్గింది. మార్చి నెలలో సింగిల్ షేరింగ్ కు రూ. 9530గా ఉంది.
ఈ టూర్ ప్యాకేజీ (Tour Package) లో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్ (Break Fast) , లంచ్ (Lunch) , డిన్నర్ (Dinner) వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు బెడ్ కావాలంటే రూ.5,930, బెడ్ అవసరం లేదు అంటే రూ.4,940 చెల్లించాలి. మరోవైపు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు యాత్రికులే చూసుకోవాలి. రైలు ప్రయాణంలోనూ మీల్స్ ఉండవు. పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే సందర్శకులే చూసుకోవాలి. గైడ్ ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.