IRCTC Tamilnadu Trip Package Details: భక్తులకు గుడ్‌న్యూస్, 6 రోజుల్లోనే తమిళనాడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం, ప్యాకేజీ ధర ఎంతంటే?

IRCTC Tamilnadu Trip Package Details

IRCTC Tamilnadu Trip Package Details: మీరు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చూడాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసమే IRCTC ఒక శుభవార్త అందించింది. ” ట్రెజర్స్‌ ఆఫ్‌ తమిళనాడు” (Treasures Of  TamilNadu) .

పేరుతో కొత్త ఎయిర్ టూర్‌ ప్యాకేజీ (Air Tour Package) ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరు రోజులలో, తమిళనాడులోని కుంభకోణం, మదురై (Madurai), రామేశ్వరం (Rameshwaram) మరియు తంజావూరుతో సహా గుర్తించదగిన ప్రదేశాలు మరియు దేవాలయాలను సందర్శించవచ్చు.

IRCTC హైదరాబాద్ నుండి రూ.29,250 నుండి విమాన టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. ఈ ప్యాకేజీ ఆగస్టు 13-18 వరకు అందుబాటులో ఉంటుంది. IRCTC మొత్తం 29 సీట్లతో ఎయిర్ టూర్‌ (Air Tour) ను అందిస్తోంది.

ప్యాకేజీ ధరలు (Package Prices):

సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 39850. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 30500. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 29250. పిల్లలకు (5-11 సంవత్సరాలు) రూ. 26800గా నిర్ణయించారు.

పర్యటన వివరాలు :

1 వ రోజు : హైదరాబాద్ – తిరుచ్చి (Hyderabad – Tiruchi)

మధ్యాహ్నం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం తిరుచ్చి చేరుకుంటారు. IRCTC వాళ్ళు మిమ్మల్ని విమానాశ్రయం నుండి పికప్ చేసి హోటల్‌కి పంపిస్తారు. రాత్రికి తిరుచ్చిలో బస చేస్తారు.

2వ రోజు : తిరుచ్చి-తంజావూరు-కుంభకోణం  (Tiruchi – thanjavur – kumbakonam)

హోటల్‌ లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్‌ నుండి బయటకు వెళతారు. శ్రీరంగం, జంబుకేశ్వర ఆలయాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం తంజావూరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కుంభకోణంకి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోని హోటల్‌ లో బస చేస్తారు.

3వ రోజు : కుంభకోణం – చిదంబరం – కుంభకోణం (Kumbakonam – Chidambaram – Kumbakonam) 
హోటల్ వద్ద అల్పాహారం తర్వాత, చిదంబరంకి బయలుదేరండి. నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శించండి. తర్వాత గంగైకొండ చోళపురంకి వెళ్లండి. మధ్యాహ్నం, తిరిగి కుంభకోణం చేరుకోవాలి. తర్వాత కుంభకోణంలోని స్థానిక ఆలయాలు కాశీ విశ్వనాథర్, సారంగపాణి, మరియు ఆది కుంభేశ్వర ఆలయం సందర్శిస్తారు. రాత్రి కుంభకోణంలో బస చేస్తారు.

4వ రోజు : కుంభకోణం-రామేశ్వరం (Kumbakonam – Rameshwaram)

హోటల్‌లో అల్పాహారం చేసి, రామేశ్వరం కి బయలుదేరండి. మధ్యాహ్నం రామేశ్వరం చేరుకుంటారు. హోటల్‌కి చెక్ ఇన్ చేయండి. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయానికి వెళ్లాలి. రాత్రికి రామేశ్వరంలో బస చేస్తారు.

5వ రోజు : రామేశ్వరం – మధురై (Rameshwaram – madurai)

ఉదయాన్నే దనుష్కోడి సందర్శన. ఆ తర్వాత హోటల్‌లో అల్పాహారం అందిస్తారు. అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శించారు. ఆ తర్వాత మదురైకి ప్రయాణం ఉంటుంది. మదురైలో రాత్రి బస చేస్తారు.

6వ రోజు : మధురై – హైదరాబాద్ (Madurai – Hycderabad) 

హోటల్‌లో అల్పాహారం తర్వాత మీనాక్షి గుడికి వెళతారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. ఫ్లైట్ లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in