Mudra Loan For New Business: వ్యాపారం (Bussiness) చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు వ్యాపారం మొదలుపెట్టాలని ఆశతో ఉంటారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు వ్యాపారానికి కావాల్సిన నిధులు లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. లోన్ (Loan) కోసం చూస్తుంటారు. అయితే బ్యాంకులు వసూలు చేసే అధిక వడ్డీకి భయపడి కూడా వెనుకడుడు వేస్తుంటారు. అయితే, మీరు కూడా వ్యాపారం చేసే ఉద్దేశంలో ఉన్నారా? అయితే, కేంద్ర ప్రభుత్వం (Central Government) మంచి పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకంతో వ్యాపారం (Business) చేయాలనుకునే వారికి రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఈ లోన్ పొందడానికి ఎలాంటి సెక్యూరిటీ పేపర్లు (Security Papers) అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా రుణం పొందే అవకాశాన్ని కల్పించారు.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY)ని 10 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి ఏప్రిల్ 8, 2015 లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి ప్రవేశపెట్టారు.
ముద్రా యోజన లోన్లు మూడు రకాలు (3 types) గా అందిస్తారు.
మొదటిది శిషు రుణం. ఈ రుణంలో, రూ. 50 వేలు వరకు లోన్ మంజూరు చేస్తారు.
రెండవది కిషోర్ లోన్, ఇది రూ. 5 లక్షలు వరకు లోన్ ను అందిస్తుంది.
మూడవది తరుణ్ లోన్,ఈ లోన్ పది లక్షల వరకు రుణాలను అందిస్తుంది. వ్యాపారాన్ని బట్టి లోన్ అమౌంట్ మారుతుంది.
ఈ ముద్ర యోజన కోసం బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ (Non Banking) ఫైనాన్షియల్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు (Micro Finance) వంటి వాటిని ఆశ్రయించొచ్చు. వాణిజ్య బ్యాంకులు, RRBలు, కోఆపరేటివ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ తరహా లోన్లు అందిస్తున్నాయి.
PM ముద్రా లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం :
ముందుగా అధికారిక వెబ్‌సైట్ (Official Website) ను సందర్శించండి.
హోమ్ పేజీలో శిశు, తరుణ్ మరియు కిషోర్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి .
మీకు ఎలాంటి లోన్ కావాలో దానికి తగ్గట్టుగా రుణాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి.
ఎంచుకున్న ఋణంపై క్లిక్ చేసినప్పుడు, దరఖాస్తు ఫారమ్ లింక్ కనిపిస్తుంది.
ఇప్పుడు డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసి PM ముద్ర లోన్ స్కీమ్ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, దాని ప్రింటౌట్ తీసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు సరిగ్గా పూర్తి చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత, మీరు అభ్యర్థించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా జోడించాలి.
ఇప్పుడు, తప్పనిసరిగా ఈ దరఖాస్తు ఫారమ్‌ని తీసుకొని మీ సమీపంలోని బ్యాంకుకు డెలివరీ చేయాలి.
బ్యాంక్ సిబ్బంది మీ దరఖాస్తును ఆమోదించిన తర్వాత, మీరు PM ముద్రా లోన్ స్కీమ్‌కు అర్హులవుతారు.