Requirements For Jobs in AP: ఏపీలో ఉద్యోగాలకు భర్తీ, ఈ అర్హతలు ఉంటే చాలు జాబ్ మీ సొంతం

Requirements For Jobs in AP

Jobs in AP: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. అయితే, కొందరు వారి లక్ష్యాన్ని సాధించి గొప్ప గొప్ప స్థాయిలో నిలిచినా వాళ్ళు ఉన్నారు. మరి కొందరు ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో చదువుతున్నారు. అయితే, తాజాగా ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ (Job Notification) విడుదల అయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వృత్తికి పెద్ద పోటీలు కూడా లేవు. అర్హతలు, వేతనం మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం.

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఎంట్రీ మరియు లాటరల్ ఎంట్రీ (Lateral Entry) ద్వారా కొత్తగా ఏర్పటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం మొత్తం 29 ఖాళీలను భర్తీ చేస్తుంది. మెడికల్ పీజీ డిగ్రీ (Medical PG Degree) , పీహెచ్‌డీ సర్టిఫికేషన్ (PHD Certification) , పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత మరియు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్థానాలకు అకడమిక్ మెరిట్, ఉద్యోగ అనుభవం, రిజర్వేషన్ నియమాలు వంటివి చూసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


శాఖల వారీగా ఖాళీలు:

మైక్రోబయాలజీ: 07
ఫార్మకాలజీ: 06
అనాటమీ : 03
బయోకెమిస్ట్రీ: 06
ఫిజియాలజీ : 07

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు రుసుము రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ మే 18, 2024న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27, 2024.

అర్హతలు:

మైక్రోబయాలజీ మరియు ఫార్మకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) కలిగి ఉండాలి.
అనాటమీ విభాగానికి MD/MS (అనాటమీ) PhD (మెడికల్ అనాటమీ) లేదా MSc (మెడికల్ అనాటమీ) తో DSC (మెడికల్ అనాటమీ) కలిగి ఉండాలి.
బయోకెమిస్ట్రీ విభాగంలో పనిచేయడానికి, తప్పనిసరిగా MD (బయోకెమిస్ట్రీ) లేదా MSc (మెడికల్ బయోకెమిస్ట్రీ)తో పాటు PhD (మెడికల్ బయోకెమిస్ట్రీ) లేదా MSc (మెడికల్ బయోకెమిస్ట్రీ)తో పాటు DSC కలిగి ఉండాలి.
ఫిజియాలజీ విభాగానికి అభ్యర్థులు తప్పనిసరిగా MD (ఫిజియాలజీ) లేదా MSc (మెడికల్ ఫిజియాలజీ)తో పీహెచ్‌డీ (మెడికల్ ఫిజియాలజీ) లేదా డీఎస్సీతో ఎంఎస్సీ (మెడికల్ ఫిజియాలజీ) పూర్తి చేసి ఉండాలి.
జనరల్ అభ్యర్థులకు వయోపరిమితి 42 ఏళ్లు. వారు జూలై 1, 1981 తర్వాత జన్మించి ఉండాలి.
EWS, SC, ST, మరియు BC కేటగిరీల అభ్యర్థులు 47 ఏళ్లలోపు ఉండాలి. వారు జూలై 1, 1976 తర్వాత జన్మించి ఉండాలి.
వికలాంగ అభ్యర్థుల వయస్సు 52 ఏళ్లలోపు ఉండాలి. వారు జూలై 1, 1971 తర్వాత జన్మించి ఉండాలి.
ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లలోపు ఉండాలి. వారు జూలై 1, 1973 తర్వాత జన్మించి ఉండాలి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in