Good News For EPFO Clients : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక అద్భుతమైన వార్తలను అందించింది. డబ్బు విత్‌డ్రా (Money Withdraw) కు ప్రస్తుతం ఉన్న నిబంధనలను EPFO సడలిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాసెస్ ను మరోసారి సడలించింది. దీంతో, వినియోగదారుల ఖాతాకు PF డబ్బు వెంటనే అందే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజుల కిందటే, పెళ్లి, గృహనిర్మాణం మరియు వైద్య ఖర్చులు (Medical Expenditure) వంటి ప్రయోజనాల కోసం PF విత్ డ్రాయల్ పరిమితిని రూ. 50 వేల నుండి లక్ష వరకు పెంచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ , తర్వాత వీటిని ఆటో సెటిల్మెంట్ (Auto Settlement) పరిధిలోకి తెచ్చారు. ఇంతక డబ్బు జమ అవ్వడానికి పది రోజుల వరకు పట్టేది కానీ ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ లేకుండానే సింపుల్ ప్రాసెసింగ్‌తో 3-4 రోజుల్లో డబ్బు ఖాతాలో జమ అవుతుంది.
అయితే, ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరి గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా, PF విత్ డ్రా క్లెయిమ్ (With Draw Claim) చేసే సమయంలో చెక్ లీఫ్ మరియు బ్యాంక్ పాస్‌బుక్‌ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అయితే కొందరికి ఈ నిబంధనను సడలిస్తున్నట్లు సమాచారం. అంటే, చెక్ లీఫ్ మరియు బ్యాంక్ పాస్‌బుక్ ని అప్లోడు చేయకుండానే పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.
క్లెయిమ్‌లు చేసుకునేందుకు పీఎఫ్ కార్యాలయానికి వెళ్లే వారికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారు నేరుగా డాక్యుమెంట్స్ (Documents) పంపితే సరిపోతుంది. అయితే, పీఎఫ్ పోర్టల్ (PF Portal) నుంచి నగదు విత్ డ్రా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. వారి క్లెయిమ్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు ఈ కొత్త నిబంధనను అమలు చేసినట్లు భావిస్తున్నారు. దీంతో, క్లెయిమ్‌లు ఎక్కువగా రిజెక్ట్ స్పష్టం చేశారు.
చెక్ (Cheque) మరియు బ్యాంక్ పాస్‌బుక్ (Bank PassBook) అప్లోడ్ చేయలేని సందర్భాల్లో, బ్యాంక్ KYC వెరిఫికేషన్ క్లియర్ గా ఉంటే సరిపోతుంది. UIDAI ద్వారా ఆధార్ సీడింగ్ వెరిఫికేషన్ చేసిన సరిపోతుంది. అలా చేస్తే ఇకపై చెక్ లీవ్, బ్యాంకు పాస్‌బుక్ అప్లోడు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. PF విత్ డ్రా పని లేకుండా చేయాలని మరియు ఖాతాదారు మరణిస్తే ఆధార్ సీడింగ్ చేయాలని EPFO ప్రకటించింది.