Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ బైక్, ప్రారంభం అయ్యేది ఆ రోజే, మరి ఫీచర్స్ ఏంటి?

Bajaj CNG Bike

Bajaj CNG Bike: కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? బజాజ్ త్వరలో కొత్త CNG పవర్డ్ బైక్‌ (Power Bike) ను విడుదల చేయనుంది. ఈ నెల ప్రారంభంలో, పల్సర్ NS400Z లాంచ్ వేడుకలో, బజాజ్ ఆటో MD రాజీవ్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న CNG మోటార్‌బైక్‌ (CNG Motor Bike) ను జూన్ 18, 2024న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే, లాంచ్ డేట్ సమీపంలో ఉన్నందున, కంపెనీ బజాజ్ ‘ఫైటర్’ బ్రాండ్ కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది.

ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, ‘బజాజ్ ఫైటర్’ (Bajaj Fighter) అనే మోనికర్‌ను ట్రేడ్‌మార్క్ చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి CNG బైక్ అవుతుంది. గత నెలలో, కంపెనీ బజాజ్ బ్రూజర్ అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ (Trademark) చేసింది. అయితే, పేర్లను బజాజ్ (Bajaj) ఇంకా వెల్లడించలేదు. జూన్ 18న తొలి CNG బైక్‌ను పరిచయం చేయనున్నారు. పెట్రోల్‌తో నడిచే దాని ఖర్చుతో పోలిస్తే. ఈ బైక్ కి సగం ఖర్చు అవుతుంది.

కంపెనీ యొక్క CNG మోడల్ ‘పెట్రోల్ (Petrol) మరియు డీజిల్ (Diesel) ధరల మధ్య, పెరుగుతున్న రన్నింగ్ ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇది మొదట మహారాష్ట్ర (Maharashtra) లో ప్రారంభించడం జరుగుతుంది. తరువాత CNG స్టేషన్లు ఉన్న రాష్ట్రాల్లో ప్రారంభిస్తారు. బజాజ్, ‘మేము 100CC, 125CC మరియు 150-160CC మోడళ్లతో కూడిన CNG బైక్‌ల పోర్ట్‌ఫోలియో (Portfolio) ను రూపొందిస్తాము” అని పేర్కొన్నారు. ఇంజన్ కెపాసిటీ 110 మరియు 125cc మధ్య ఉంటుందని అంచనా. ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు .

Also Read: Splendor Plus XTEC 2.0 : అదిరే ఫీచర్స్ తో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ బైక్ లాంచ్, ధర చూస్తే వెంటనే కొనేస్తారు

CNG మోటార్‌ బైకుపై గత ఆరు నెలలుగా వివిధ టెస్టులు జరిపారు. సాధారణ కమ్యూటింగ్ బైక్‌ను పోలి ఉండే టెస్ట్ మ్యూల్‌లో హాలోజన్ టర్న్ లైట్లు, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు సస్పెన్షన్ కోసం మోనోషాక్ యూనిట్ ఉన్నాయి. ఇది మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, పొడవైన సింగిల్ పీస్ సీటు మరియు డిస్క్/డ్రమ్ బ్రేకింగ్ కాంబోని కలిగి ఉంటుంది.

ఈ CNG బైక్ తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. మొదటి త్రైమాసికంలో కంపెనీ FY25 CNG బైక్‌ను ప్రారంభించనున్నట్లు బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ (Rajiv Bajaj) గత నెలలో ప్రకటించారు. ఇంధన ధరలను సగానికి తగ్గించాలని ఆయన చెప్పారు. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి, ప్రోటోటైప్‌ను పరీక్షించినప్పుడు, కార్బన్ డయాక్సైడ్ (CO2) ఎమిషన్ 50%, కార్బన్ మోనాక్సైడ్ (CO) ఎమిషన్ 75% మరియు మీథేన్ కాని హైడ్రోకార్బన్ ఎమిషన్లు 90% తగ్గాయని రాజీవ్ పేర్కొన్నారు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in