Oppo F27 Series : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ Oppo నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Oppo F27 సిరీస్ ఈ నెలాఖరులో భారతీయ మార్కెట్లోకి రానుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ లీక్ చేసిన పోస్టర్ ప్రకారం, ఈ సిరీస్‌లో మూడు మోడల్‌లు ఉంటాయి. ఒప్పో ఎఫ్ 27, ఒప్పో ఎఫ్ 27 ప్రో మరియు ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్. ముఖ్యంగా, Oppo F27 Pro IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ భారతదేశంలో Oppo F27 సిరీస్ లాంచ్ వివరాలను వెల్లడిస్తూ పోస్టర్‌ను పంచుకున్నారు. Oppo F27 Pro Plus జూన్ 13 నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సిరీస్ మోడల్‌లలో ఒకటి దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP66, IP68 మరియు IP69 రేటింగ్‌లను కలిగి ఉంటాయి.
Oppo F27 ప్రో ప్లస్ డిజైన్ ఇటీవల చైనాలో లాంచ్ అయిన Oppo A3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను పోలి ఉంటుంది. Oppo F27 Pro Plus స్మార్ట్ ఫోన్ Oppo A3 ప్రో యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది వెనుక ప్యానెల్ యొక్క మధ్యలో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది మరియు రెండు రంగు ఎంపికలలో వస్తుంది.
Oppo A3 ప్రో అనేది కంపెనీ నుండి IP69 రేటింగ్‌తో చైనాలో ప్రారంభించబడిన మొదటి ఫోన్. Oppo A3 సిరీస్ ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు అలాగే ఇందులో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొస్తున్న ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ (Mediatech Dimensity) 7050 చిప్‌సెట్‌ను అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.