BYD Electric Super Car: ఈ ఎలక్ట్రిక్ కార్ సూపరో సూపర్, ఆగకుండా 2,000 కీ.మీ ప్రయాణించొచ్చు

BYD Electric Super Car
image credit:byd.com

BYD Electric Super Car: మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ (New Models) తో వాహనాలు వస్తూనే ఉంటాయి. కంపెనీలు పోటీ పడి కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త కార్లు మరియు వాహనాలను పరిచయం చేస్తున్నాయి. అయితే, తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) కు చాలా డిమాండ్ ఉంది. చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో ఎన్నో వాహనాలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం, 1000-కిలోమీటర్ల రేంజ్ కలిగిన కార్లు మార్కెట్లో ఉన్నాయి. అయితే , ఒక్కసారి ఛార్జింగ్ (Charging) పెడితే ఆపకుండా వెయ్యి కి.మీ ప్రయాణించవచ్చు. అయితే, కంపెనీలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రేంజ్ ఉన్న కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. చైనాకి చెందిన BYD కంపెనీ అదిరిపోయే టెక్నాలజీ (Technology) ని కనిపెట్టింది. BYD కంపెనీ ఇప్పుడే కొత్త హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ను పరిచయం చేసింది. ఈ టెక్నాలజీతో రీఛార్జ్ చేసుకోకుండానే మరియు రీఫ్యూయల్ చేయడకుండానే ఇక ఆగకుండా 2,000 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ఈ కొత్త టెక్నాలజీ (Technology) EV సెక్టార్‌లో కొత్త పోటీకి దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టయోటా మోటార్ మరియు ఫోక్స్‌వ్యాగన్ వంటి వాహన తయారీదారులకు BYD సవాలు విసిరిందనే చెప్పుకోవాలి. ఇక ఈ కొత్త టెక్నాలజీ విషయానికి వస్తే రెండు కార్లుగా మార్కెట్ లోకి పరిచయం కానుంది. ధర 100,000 యువాన్ల కంటే తక్కువగా ఉండవచ్చు. డాలర్లలో కొలిస్తే, ధర $13,800 ఉండవచ్చు.

Also Read: Okaya Electric Scooter : ఆ ఈవీ స్కూటర్‌పై మతిపోయే ఆఫర్.. సింగిల్ ఛార్జ్ తో 160kms రేంజ్.

కొన్ని BYD డ్యూయల్ మోడ్ ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలు సింగపూర్ నుండి బ్యాంకాక్, న్యూయార్క్ నుండి మయామి మరియు మ్యూనిచ్ నుండి మాడ్రిడ్ వరకు ఒకే ఛార్జీతో వెళ్ళవచ్చు. కొత్త టెక్నాలజీ వల్ల ఇంధన ఖర్చులు అధికంగా తగ్గుతాయని కంపెనీ చెప్పింది.

BYD ప్రకారం, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలు 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే మీరు ఎంత దూరం వెళ్లగలరో మీకు తెలుసు. ప్రస్తుతం ఈ హై టెక్నాలజీ వాహనాలు చైనా (China) లో మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఇది త్వరలో అంతర్జాతీయ ఎగుమతులకు అందుబాటులోకి రానుంది.

ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ (Electric and hybrid) వాహనాల రేంజ్ గణనీయంగా పెరుగుతుంది. దీంతో వాహనదారులకు ఊరట లభించే అవకాశం ఉంది. అయితే, మన దేశంలో హైబ్రిడ్ ఆటోమొబైల్ రెవెల్యూషన్ ఇంకా ప్రారంభం కాలేదు. BYD 2022లో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త ఆటోమొబైల్స్ Quinn L మరియు Seal 06 వాహనాలు రాబోయే జనరేషన్ లో హైబ్రిడ్ టెక్నాలజీ (Hybrid Tecnology) తో నడిచేవి. అంటే ఈ వాహనాలు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మరియు పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో నడుస్తాయి. 2,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. సంస్థ ప్రకారం, ఇది ప్రతి 100 కిలోమీటర్లకు 2.9 లీటర్ల ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.11 లక్షలు ఉంటుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in