Moto Edge 50 Pro 5G : Moto Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ మంచి డిజైన్‌ను కలిగి ఉంది. మిడ్ రేంజ్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. బ్యాంక్ కార్డ్‌లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 CPUని ఉపయోగిస్తుంది.
Moto Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED 1.5K డిస్ప్లేను కలిగి ఉంది. DC డిమ్మింగ్ ఫంక్షనాలిటీ గరిష్టంగా 2000 నిట్ల బ్రైట్ నెస్ ని కలిగి ఉంది. ఈ Moto స్మార్ట్‌ఫోన్ Android 14-ఆధారిత Hello UI OSతో నడుస్తుంది. Motorola మూడు Android అప్డేట్లు మరియు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లకు మద్దతు ఇచ్చింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC చిప్సెట్ని ఉపయోగిస్తుంది.
Moto Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 125W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది అనేక ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, అడ్వాన్స్డ్ లాంగ్ ఎక్స్పోజర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ మరియు బోకె వంటి ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరచడానికి AI ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.
ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌లో పాంటోన్తో కూడిన AI- పవర్డ్ ప్రో-గ్రేడ్ కెమెరాలు ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్లో 3x మాగ్నిఫికేషన్ కెపాసిటీతో 10MP టెలిఫోటో లెన్స్, అలాగే 50MP మెయిన్స్ కెమెరా మరియు 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా ఆటో ఫోకస్ ఫీచర్‌ను కలిగి ఉంది.
Moto Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకటి 8GB RAM + 256GB స్టోరేజ్ మరియు ఇంకోటి 12GB RAM + 256GB స్టోరేజ్ ని కలిగి ఉంది. హ్యాండ్సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. లక్స్ లావెండర్, బ్లూ బ్యూటీ మరియు మూన్లైట్ పెర్ల్లలో అందుబాటులో ఉంది.
Moto Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.29,999గా ఉంది. HDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దాంతో అది, రూ. 27,999కే లభిస్తుంది. ఇది IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ని కలిగి ఉంది.
Moto Edge 50 Pro 5G