Alcohol Rates Decreased: ఎక్కువగా చాలా మంది మద్యానికి అలవాటు పడి.. రోజు తాగితే కానీ వారి రోజు గడవదు అన్నట్టుగా ఉంటారు. ఇక మందు షాపులు బంద్ అని తెలిస్తే ముందే ఇంట్లో స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు. మద్యం అలవాటు ఉన్నవారికి.. కష్టం వచ్చిన, సుఖం వచ్చిన, బాధ వచ్చిన మద్యం తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
దుఃఖం, ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతర సమస్యలను అధిగమించడానికి ఆల్కహాల్ (Alcohol) ఏకైక మార్గం అని నమ్ముతారు. మద్యానికి బానిస అయిన వారు ప్రతిరోజూ మద్యం సేవిస్తారు. పొరపాటున కూడా డ్రింక్ (Drink) చేయకుండా పడుకుంటే.. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. మద్యానికి బానిసలైతే ఉదయం నుండి రాత్రి వరకు తాగుతూ..ఊగుతూనే ఉంటారు. అదే, వీకెండ్స్ లో మద్యం తాగేవారు ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లించి మద్యం సేవించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అయితే, తాజాగా, వివిధ ప్రాంతాల్లో మద్యం దొరకక తెలంగాణ ప్రజలు (Telangana People) ఇతర ప్రాంతాల నుండి తెప్పించుకొని మరి తాగుతున్నారు. అయితే, మద్యం ప్రియులకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించనుంది. ట్విస్ట్ ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో తమతో సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు అనగా.. కర్ణాటక ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ప్రీమియం బ్రాండ్ స్పిరిట్స్ ధరలు తగ్గనున్నాయి. ఫిబ్రవరి బడ్జెట్‌లో, పొరుగు రాష్ట్రాలకు తగ్గట్టుగా కర్ణాటక స్పిరిట్స్ ధరలను తగ్గిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Cheif Minister Sidha Ramaiah) తెలిపారు. ఈ ప్రకటన వెంటనే అమల్లోకి రానుంది. మరింత ఆదాయాన్ని పెంచడానికి, రాష్ట్ర ప్రభుత్వం స్పిరిట్ ధరలను తగ్గిస్తుంది. రాష్ట్రంలో అధిక ఎక్సైజ్ ఛార్జ్ కారణంగా పొరుగు రాష్ట్రాల కంటే కర్ణాటక (Karnataka) లో స్పిరిట్ ధర ఎక్కువగా ఉంది. పర్యవసానంగా పొరుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు కల్తీ మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం.
Also Read: New Railway line in Telangana : తెలంగాణలో కొత్త రైల్వే లైన్, ఏ ప్రాంతంలో అంటే?
ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు లిక్కర్ కొనుగోలు కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారట. దాంతో, రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నులను కోల్పోతోంది. దీని వల్ల లిక్కర్ రేట్లు తగ్గుతాయని అంచనా. ఎక్సైజ్ పన్ను వసూళ్లను పెంచడంతోపాటు లిక్కర్ విక్రయాలను కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ ధర మార్పు చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం 750 మి.లీ. ఫుల్ సైజ్ బ్రాండెడ్ లిక్కర్ బాటిల్ (Liquor Bottle) ధర రూ.2,000 కాగా, ఇప్పుడు రూ. 1800, లేదా రూ. 1700కే లభ్యం అవుతుంది. అలాగే బడా బ్రాండెడ్ మద్యం రూ.7100 వద్ద ఉన్న ధర ఇప్పుడు రూ.5200 రూపాయలకు లభించగా.. అదేవిధంగా లిక్కర్ ధర రూ. 5,000 ఉండగా..ఇప్పుడు దాని ధర రూ.3600-3700గా నిర్ణయించనున్నట్లు తెలిసింది.