Whats App Users New Feature: వాట్సాప్ యూజర్స్ కి మరో ఫీచర్ వచ్చేసింది, ఇక నంబర్ సేవ్ చేసుకోవాల్సిన పని లేదు

Whats App Users New Feature

Whats App Users New Feature: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు (Smart Phone Customers) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌ (Whats App) ను ఉపయోగించి మెసేజ్ లను పంపించుకుంటూ ఉంటారు.

చాట్ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియోస్ , డాకుమెంట్స్ మరియు వాయిస్ కాల్ (Voice Call) ఇంకా వీడియోస్ కాల్స్ కోసం వాట్సప్ యాప్ ని వినియోగిస్తారు.

వేరే యాప్స్ లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నాయ్ కానీ ఎక్కువగా వాట్సప్ కే ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా, వాట్సాప్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.

ఇది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌లు యాప్ యొక్క వినియోగం మరియు వినియోగదారు అనుభవాన్ని రెండింటినీ మెరుగుపరుస్తాయి. ఇప్పుడు, ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సప్ మెసేజ్ లను ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం.

నంబర్‌ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్ ని పంపాలి?

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • ఐఫోన్ వినియోగదారుల కోసం, పైన ప్లస్ మార్క్ ఉంటుంది.
  • ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం, WhatsApp యాప్ కింద ప్లస్ మార్క్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  • మీరు ఎవరికి మెసేజ్ పంపుతున్నారో ఆ నంబర్‌ను కాపీ చేయండి.
  • ఆ తర్వాత, సెర్చ్ కాంటాక్ట్ బటన్‌పై క్లిక్ చేసి, నంబర్‌ను నమోదు చేయండి.

WhatsApp Update 

Also Read: Google Pay New Feature: ‘గూగుల్ పే’ ని వాడుతున్నారా? సరికొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా?

ఫోన్ నంబర్ WhatsApp ఖాతాతో లింక్ అయి ఉంటే, చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా ఫైల్‌లు (Files), ఫోటోలు (Photos) మరియు ఇతర కంటెంట్‌ను సెండ్ చేయవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ (Smart Phone) లేదా కంప్యూటర్‌ (Computer) లో బ్రౌజర్‌ను తెరవండి.
అడ్రెస్ బాక్స్ లో, ఈ లింక్ ను https://api.whatsapp.com/send?phone=xxxxxxxxxxxx. పేస్ట్ చేయండి.
మీరు WhatsApp సందేశాన్ని పంపాలనుకుంటున్న సెల్‌ఫోన్ నంబర్‌తో xxxxxxxxxని పేస్ట్ చేయండి.

ఉదాహరణకు, నంబర్ 1234567890 అయితే, URL http://wa.me/911234567890 అయి ఉండాలి.
ఇప్పుడు, URLని యాక్సెస్ చేయడానికి ఎంటర్ నొక్కండి. చాట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
ఫోన్ నంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ ని పంపవచ్చు..

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in