New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్ని ఉపయోగించాలన్న రేషన్ కార్డునే ప్రామాణికంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఆరు హామీలను అమలు చేసేందుకు అధికారులు ప్రజా పరిపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణలో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, గృహజ్యోతి కార్యక్రమం కింద ఉచిత బస్సు రవాణా, రూ.500లకే గ్యాస్ సిలిండర్ (Cylinder) మరియు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ (Current) ను అందిస్తోంది.
కొత్త రేషన్‌కార్డు (Ration Card) లతో పాటు రుణమాఫీ (Runamafi) , రైతు భరోసా (Raithu Barosa) , పింఛన్ సాయం అందించడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోంది. ఒకటి మినహా ఐదు హామీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే వీటిలో అత్యధికంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి.
అంతే కాదు, ప్రజావాణిలో రేషన్‌కార్డులు, పింఛన్లు కోరిన వారి జాబితాను రూపొందించాలని అధికారులను సర్కార్ ఆదేశించినట్లు సమాచారం.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన వార్త. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారని మంత్రి సీతక్కకు వివరించారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిపోక నిధులు ఇవ్వకపోవడంతో కేంద్రం పథకాలను వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు మంత్రి సీతక్కకు తెలిపినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి త్వరలో రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై అధికారులు ఇప్పటికే పరిశీలన ప్రారంభించారు.
అర్హత ఉన్న వ్యక్తులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుంది.